Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ గెలాక్సీ S26 6జి నెటవర్క్ తో మార్కెట్ లో వచ్చేస్తుంది.

Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ గెలాక్సీ S26 6జి నెటవర్క్ తో మార్కెట్ లో వచ్చేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S26 సమాచారం:

కొత్త శాంసంగ్ ఫోన్ వచ్చేస్తుంది. వచ్చే 2026 జనవరిలో ఈ శాంసంగ్ అల్ట్రా ఫోన్ లాంచ్ కానుంది. 16GB ర్యామ్ (Samsung Galaxy S26 Ultra) వేరియంట్ యొక్క ధర కేవలం రూ. 1,59,990 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా ఉండొచ్చు . ప్రత్యేకించి 6G స్పీడ్ నెట్‌వర్క్ టెక్నాలజీతో రానుంది. లీక్‌ల ఆధారంగా శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.

శాంసంగ్ గెలాక్సీ S26 ధర మరియు మార్కెట్లోకి వచ్చే అంచనా:

భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S26, గెలాక్సీ S25 ఎడ్జ్, గెలాక్సీ S26 అల్ట్రా వంటి శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్‌లు జనవరి 2026 నాటికి మార్కెట్లోకి ప్రారంభం అవుతాయని ఒక అంచనా ఉంది . ధరల విషయానికి వస్తే గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ 16GB రామ్ వేరియంట్‌, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ. 1,59,990 ప్రారంభం ధరకు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. శాంసంగ్ ప్రారంభం సమయంలో అధికారిక ధరలు మరోలా ఉండొచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S26 ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్:

శాంసంగ్ గెలాక్సీ డిజైన్:

గెలాక్సీ S26 అల్ట్రా ఏకీకృత కెమెరా ద్వీపంతో కూడిన కొత్త డిజైన్‌ను కలిగి ఉండవచ్చు. S26 అల్ట్రా 7mm కంటే తక్కువ మందంతో సన్నగా ఉండే అవకాశం ఉంది, మరియు మరింత సన్నని బెజెల్స్ తో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ కెమెరా:

200MP సోనీ సెన్సార్‌తో కూడిన కెమెరా అప్‌గ్రేడ్‌ను కలిగి ఉంటుంది, మెరుగైన టెలిఫోటో లెన్స్‌లు ఉంటాయి. అండర్-డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా కూడా ఉండవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ప్రాసెసర్:

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 2 చిప్‌సెట్ లేదా ఎక్సినోస్ 2600 చిప్‌సెట్‌ను ఉపయోగించవచ్చు. S26 అల్ట్రా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 2 చిప్‌సెట్ యొక్క ఓవర్‌లాక్ చేసిన వెర్షన్‌ను ఉపయోగించవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ బ్యాటరీ పనితీరు:

5500mAh బ్యాటరీతో రానుంది, మరియు వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. S26 అల్ట్రా 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ డిస్‌ప్లే:

COE OLED డిస్‌ప్లే టెక్నాలజీతో రావచ్చు, ఇది మెరుగైన రంగులు, స్పష్టత మరియు సామర్థ్యాన్ని అందిస్తుంది.

ఇతర ఫీచర్లు:

పెద్ద వేపర్ ఛాంబర్, మెరుగైన థర్మల్స్, థర్డ్ జనరేషన్ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉండవచ్చు.

Leave a Comment