Samsung Galaxy F17 5G | శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎఫ్17 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. గతంలో ఎఫ్16 5జి ఫోన్ రాగా దానికి కొనసాగింపుగా ఎఫ్17 5జి ఫోన్‌ను లాంచ్ చేశారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. దీని ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. గెలాక్సీ ఎఫ్17 5జి స్మార్ట్ ఫోన్లో 6.7 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్లో ఎగ్జినోస్ 1330 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇచ్చారు.
Samsung Galaxy F17 5G Launch : అద్భుతమైన మోడల్ తో అదర కొడుతున్న శాంసంగ్ గెలాక్సీ F17 5జి .ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ తయారీ కంపెనీ శాంసంగ్, బడ్జెట్ ధరలో 5G ఫోన్ విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. Samsung Galaxy F17 5G పేరుతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ గురించిన ఫీచర్స్ లీక్ అవ్వడం జరిగింది. వీటి ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ ఎక్సీనోస్ ప్రాసెసర్, అదిరిపోయే కెమెరా, శక్తివంతమైన బ్యాటరీతో రానుందని సమాచారం. ఇక ధర కూడా అందుబాటులోనే ఉంటుందని లీకుల ద్వారా తెలుస్తుంది.
అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఇంకా విడుదల కాకముందే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కొన్ని ఆన్ లైన్ మీడియా ప్లాట్ ఫారంలలో లీక్ అవ్వడం జరిగింది. వీటి ప్రకారం, Samsung Galaxy F17 5G ఎక్సీనోస్ 1330 ప్రాసెసర్ తో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే, ఇది 4 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అనే రెండు వేరియంట్స్ తో విడుదల అయ్యే అవకాశం ఉందని, ఇందులో బేస్ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 14,499 లుగా, అలాగే 6 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 15,999 లుగా ఉండే అవకాశం ఉందని లీకుల ద్వారా తెలుస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్ డేట్స్ తో పాటు 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్స్ తో రానున్నట్లు తెలుస్తుంది. అలాగే బాక్స్ లో ఛార్జర్ ని కూడా కంపెనీ ఇవ్వడం లేదని లీకుల ద్వారా తెలుస్తుంది.