Royal Enfield: బంపర్ ఆఫర్ తో భారీగా తగ్గనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరలు..!

Royal Enfield: బంపర్ ఆఫర్ తో భారీగా తగ్గనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరలు..!.Royal Enfield: బంపర్ ఆఫర్ తో భారీగా తగ్గనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరలు..!.Royal Enfield Price: ఇటీవల జరిగిన సమావేశంలో GST కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరలు మారనున్నాయి. ఏ మోడల్ ధర ఎంత మారుతుందో చూద్దాం.

ఇండియన్‌ మార్కెట్‌లో బెస్ట్ సెల్లింగ్ టూ-వీలర్స్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు పేరుంది. ఈ బైక్‌ల ధరలకు సంబంధించి రీసెంట్‌గా కీలక అప్‌డేట్ వచ్చింది. ఇటీవల జరిగిన సమావేశంలో GST కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరలు మారనున్నాయి. ఏ మోడల్స్ ధరలు పెరుగుతాయి? ఏ మోడల్స్ ధరలు తగ్గుతాయి? అనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం.

వీటి ధరలు తగ్గుతాయి:

రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ 350-650 CC విభాగంలో అగ్రస్థానంలో ఉంది. 350 CC కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్‌లకు GST రేటు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గనుంది. దీనివల్ల కంపెనీ టాప్‌ మోడల్స్ అయిన హంటర్ 350, క్లాసిక్ 350, మెటియర్‌ 350, గోవాన్ క్లాసిక్, బుల్లెట్ 350 ధరలు తగ్గుతాయి. కంపెనీ అమ్మకాల్లో 87 శాతం వాటా ఈ వీటిదే. కాబట్టి కంపెనీ సేల్స్ బాగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఒక మంచి అవకాశం.

అంచనా ధరలు:

GST రేట్ల మార్పు కారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరలు ఎలా మారతాయో ఇప్పుడు చూద్దాం.
హంటర్ 350: దీని ధర రూ.1,49,900 నుంచి రూ.1,34,910 కి తగ్గే అవకాశం ఉంది. అంటే రూ. 14,990 తగ్గుతుంది.
క్లాసిక్ 350: దీని ధర రూ.1,93,000 నుంచి రూ.1,73,000 కి తగ్గుతుంది. అంటే రూ. 20,000 తగ్గుతుంది.
మెటియర్‌ 350: దీని ధర రూ.2,05,191 నుంచి రూ.1,85,191 కి తగ్గుతుంది. అంటే రూ. 20,000 తగ్గుతుంది.బుల్లెట్ 350: దీని ధర రూ.1,73,000 నుంచి రూ.1,57,000 కి తగ్గుతుంది. దాదాపు రూ.17,000 తగ్గుతుంది.
గోవాన్ క్లాసిక్ 350: దీని ధర రూ.2,35,000 నుంచి రూ.2,11,500కి చేరుతుంది. అంటే రూ.23,500 తగ్గుతుంది.
హిమాలయన్ 450: దీని ధర రూ.2,85,000 నుంచి రూ.3,10,650 కి పెరుగుతుంది. అంటే రూ.25,650 పెరుగుతుంది.
గెరిల్లా 450: దీని ధర రూ.2,39,000 నుంచి రూ.2,60,500కి చేరుతుంది. అంటే రూ.21,510 పెరుగుతుంది.
స్క్రామ్ 440: దీని ధర రూ.2,08,000 నుంచి రూ.2,26,700కి చేరుతుంది. అంటే రూ.18,720 పెరుగుతుంది.












Leave a Comment