HONOR X9C : హానర్ X9C 5G AI ఫీచర్లు భారతదేశంలో ప్రారంభించబడింది.

HONOR X9C : హానర్ X9C 5G AI ఫీచర్లు భారతదేశంలో ప్రారంభించబడింది.HONOR X9C : హానర్ X9C 5G AI ఫీచర్లు భారతదేశంలో ప్రారంభించబడింది. హానర్ తన కొత్త X9c 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది మరియు జూలై 12 నుండి 14 వరకు జరగబోయే ప్రైమ్ డే సేల్ సందర్భంగా అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి ఇది అందుబాటులో ఉంటుంది.

హానర్ తన కొత్త X9c 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది మరియు జూలై 12 నుండి 14 వరకు జరగనున్న ప్రైమ్ డే సేల్ సందర్భంగా అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ పరిమిత-కాల ధర రూ. 19,999కి అందించబడుతోంది, ఇందులో లాంచ్ డిస్కౌంట్లు మరియు ఎంపిక చేసిన బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయి. దీని వలన హానర్ X9c రూ. 20,000 కంటే తక్కువ ధరకు లభించే ఆకర్షణీయమైన ఎంపికలలో ఒకటిగా నిలిచింది, ముఖ్యంగా ఘనమైన బ్యాటరీ లైఫ్ మరియు మన్నికైన నిర్మాణ నాణ్యతను అందించే స్టైలిష్ ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులకు. వాస్తవానికి రూ. 21,999 ధరతో, ఈ ఫోన్ ఒకే వేరియంట్‌లో వస్తుంది మరియు ధరకు తగినట్లుగా బలమైన లక్షణాలను అందిస్తుంది.

ధర, లభ్యత మరియు లాంచ్ ఆఫర్లు:

ప్రైమ్ డే లాంచ్‌లో భాగంగా, హానర్ X9c జూలై 12 మరియు 14 మధ్య పరిమిత కాలానికి రూ. 19,999 కు అందుబాటులో ఉంటుంది. ఈ ధరలో ఇప్పటికే జాబితాలో చేర్చబడిన ఫ్లాట్ రూ. 1,250 తగ్గింపు కూడా ఉంది. అదనంగా, SBI మరియు ICICI బ్యాంక్ కార్డ్ వినియోగదారులు అదనంగా రూ. 750 తక్షణ తగ్గింపును పొందవచ్చు. 9 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపిక కూడా ఉంది, దీనిని రూ. 1,250 లాంచ్ డిస్కౌంట్‌తో కలిపి పొందవచ్చు. అయితే, బ్యాంక్ డిస్కౌంట్ మరియు EMI ఆఫర్‌ను కలిపి ఉపయోగించలేరు.

కొనుగోలుదారులు ఏ డివైజ్‌లో ట్రేడ్ అవుతున్నారో బట్టి రూ.7,500 వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. లాంచ్ ఆఫర్‌లో భాగంగా, హానర్ రూ.1,099 విలువైన 1 సంవత్సరం పొడిగించిన వారంటీని ఉచితంగా అందిస్తోంది. ఈ ఫోన్ టైటానియం బ్లాక్ మరియు జాడే సియాన్ అనే రెండు రంగులలో లభిస్తుంది మరియు ఒకే 8GB RAM + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది.

హానర్ X9c 4nm ప్రాసెస్‌పై నిర్మించబడిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది, ఇది 8GB RAM మరియు 256GB అంతర్గత నిల్వతో జత చేయబడింది. ఈ ఫోన్ యొక్క ప్రధాన ముఖ్యాంశాలలో ఒకటి దాని పెద్ద 6600mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఒకే ఛార్జ్‌పై మూడు రోజుల బ్యాటరీ జీవితాన్ని అందించగలదని హానర్ పేర్కొంది, ఇది ప్రతిరోజూ తమ ఫోన్‌ను ఛార్జ్ చేయకూడదనుకునే వినియోగదారులకు చాలా బాగుంది.

మన్నిక పరంగా, హానర్ దాని “యాంటీ-డ్రాప్ డిస్ప్లే”ను హైలైట్ చేస్తోంది, ఇది 2 మీటర్ల ఎత్తు నుండి ప్రమాదవశాత్తు పడిపోయినా తట్టుకునేలా రూపొందించబడింది. ఈ ఫోన్ నీరు మరియు ధూళి నిరోధకత కోసం IP65 ధృవీకరణతో కూడా వస్తుంది, అంటే ఇది స్ప్లాష్‌లు లేదా తేలికపాటి సబ్‌మెర్షన్‌ను ఇబ్బంది లేకుండా తట్టుకోగలదు. అయినప్పటికీ, ఫోన్ కేవలం 7.98mm మందం మరియు 189 గ్రాముల బరువు ఉంటుంది.

వెనుక భాగంలో, హానర్ X9c 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో ఆప్టికల్ మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS + EIS) రెండింటినీ కలిగి ఉంది. కెమెరాలో మోషన్ సెన్సింగ్, AI ఎరేజర్ మరియు హై-RES మోడ్ వంటి AI ఫీచర్లు కూడా ఉన్నాయి, ఇవన్నీ వివిధ లైటింగ్ లేదా కదలిక పరిస్థితులలో ఫోటోగ్రఫీని సులభతరం చేయడానికి మరియు మరింత ప్రభావవంతంగా చేయడానికి ఉద్దేశించబడ్డాయి.

Tirupathi to Shiridi Train: తిరుపతి నుంచి షిరిడి కి రైలు ప్రయాణం కి కేంద్రం గ్రీన్ సిగ్నల్.

Tirupathi to Shiridi Train: తిరుపతి నుంచి షిరిడి కి రైలు ప్రయాణం కి కేంద్రం గ్రీన్ సిగ్నల్.Tirupathi to Shiridi Train: తిరుపతి నుంచి షిరిడి కి రైలు ప్రయాణం కి కేంద్రం గ్రీన్ సిగ్నల్.తిరుపతి- షిర్డీ మధ్య ఇకపై ప్రతిరోజూ రైలు నడవనుంది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇప్పటివరకు తాత్కాలికంగా నడిచే సర్వీసును రెగ్యులర్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తిరుపతి- షిర్డీ మధ్య 07637/07638 నంబర్ రైలును ఇకపై ప్రతి రోజూ నడపనున్నట్లు వెల్లడించింది. రేణిగుంట, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ స్టేషన్ల మీదుగా ఈ రైలు షిర్డీ చేరుకోనుంది. తిరుపతి టూ షిర్డీ మధ్య రైలు నడపాలని ఇటీవల సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తాజాగా ఆయన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది.

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ప్రతిరోజూ తిరుపతి- షిర్డీ మధ్య రైలు నడవనుంది. ఇప్పటివరకు తాత్కాలికంగా నడిచే సర్వీసును రెగ్యులర్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బ్రహ్మోత్సవాలు, దసరా, దీపావళి పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి- షిర్డీ మధ్య 07637/07638 నంబర్ రైలు ఇకపై ప్రతి రోజూ నడపనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. తిరుపతి టూ షిర్డీ మధ్య రైలు నడపాలని ఇటీవల సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది.

త్వరలో బ్రహ్మోత్సవాలు, దసరా, దీపావళి పండుగలు రాబోతున్నాయి. ఈ క్రమంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ ఇప్పటికే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇటీవల ఆ రైళ్లను నవంబర్ వరకు పొడిగించింది. వాటిలో తిరుపతి- షిర్డీ, నరసాపురం-తిరువణ్ణామలై మధ్య నడిచే రైళ్లతో పాటు, హైదరాబాద్-కొల్లాం, కాచిగూడ-మధురై మార్గాల్లోని స్పెషల్ ట్రైన్స్ కూడా తిరుపతి మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఇక ఈ సదుపాయాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

APMSRB Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు 185 ఉద్యోగాలు.

APMSRB Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు 185 ఉద్యోగాలు. APMSRB medical jobs 2025: నిరుద్యోగ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APMSRB) శుభవార్త! నోటిఫికేషన్ నం. 08/2025 ప్రకారం, ఒప్పంద ప్రాతిపదికన 185 జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెప్టెంబరు 10, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశం ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి లక్షల్లో వేతనంతో గొప్ప అవకాశం.

ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం ఖాళీలు: 185

  • జనరల్ ఫిజీషియన్ (టెలీ మెడిసిన్ హబ్): 13 పోస్టులు
  • గైనకాలజిస్ట్ (టెలీ మెడిసిన్ హబ్): 03 పోస్టులు
  • పీడియాట్రిషియన్ (DEICs): 14 పోస్టులు (అర్బన్ & రూరల్: 10, ట్రైబల్: 4)
  • మెడికల్ ఆఫీసర్ (UPHCs/UAAMs/DEICs/టెలీ మెడిసిన్ హబ్స్): 155 పోస్టులు

విద్యార్హత:

  1. జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్: ఎంబీబీఎస్ + సంబంధిత స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా + APMC రిజిస్ట్రేషన్.
  2. మెడికల్ ఆఫీసర్: ఎంబీబీఎస్ + APMC రిజిస్ట్రేషన్.

వయో పరిమితి (నోటిఫికేషన్ తేదీ నాటికి):

• OC అభ్యర్థులు: 42 సంవత్సరాలు.
• EWS/SC/ST/BC అభ్యర్థులు: 47 సంవత్సరాలు.
• వికలాంగులు: 52 సంవత్సరాలు.
• మాజీ సైనికులు: 50 సంవత్సరాలు.

Royal Enfield: బంపర్ ఆఫర్ తో భారీగా తగ్గనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరలు..!

Royal Enfield: బంపర్ ఆఫర్ తో భారీగా తగ్గనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరలు..!.Royal Enfield: బంపర్ ఆఫర్ తో భారీగా తగ్గనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరలు..!.Royal Enfield Price: ఇటీవల జరిగిన సమావేశంలో GST కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరలు మారనున్నాయి. ఏ మోడల్ ధర ఎంత మారుతుందో చూద్దాం.

ఇండియన్‌ మార్కెట్‌లో బెస్ట్ సెల్లింగ్ టూ-వీలర్స్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు పేరుంది. ఈ బైక్‌ల ధరలకు సంబంధించి రీసెంట్‌గా కీలక అప్‌డేట్ వచ్చింది. ఇటీవల జరిగిన సమావేశంలో GST కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరలు మారనున్నాయి. ఏ మోడల్స్ ధరలు పెరుగుతాయి? ఏ మోడల్స్ ధరలు తగ్గుతాయి? అనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం.

వీటి ధరలు తగ్గుతాయి:

రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ 350-650 CC విభాగంలో అగ్రస్థానంలో ఉంది. 350 CC కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్‌లకు GST రేటు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గనుంది. దీనివల్ల కంపెనీ టాప్‌ మోడల్స్ అయిన హంటర్ 350, క్లాసిక్ 350, మెటియర్‌ 350, గోవాన్ క్లాసిక్, బుల్లెట్ 350 ధరలు తగ్గుతాయి. కంపెనీ అమ్మకాల్లో 87 శాతం వాటా ఈ వీటిదే. కాబట్టి కంపెనీ సేల్స్ బాగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఒక మంచి అవకాశం.

అంచనా ధరలు:

GST రేట్ల మార్పు కారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరలు ఎలా మారతాయో ఇప్పుడు చూద్దాం.
హంటర్ 350: దీని ధర రూ.1,49,900 నుంచి రూ.1,34,910 కి తగ్గే అవకాశం ఉంది. అంటే రూ. 14,990 తగ్గుతుంది.
క్లాసిక్ 350: దీని ధర రూ.1,93,000 నుంచి రూ.1,73,000 కి తగ్గుతుంది. అంటే రూ. 20,000 తగ్గుతుంది.
మెటియర్‌ 350: దీని ధర రూ.2,05,191 నుంచి రూ.1,85,191 కి తగ్గుతుంది. అంటే రూ. 20,000 తగ్గుతుంది.బుల్లెట్ 350: దీని ధర రూ.1,73,000 నుంచి రూ.1,57,000 కి తగ్గుతుంది. దాదాపు రూ.17,000 తగ్గుతుంది.
గోవాన్ క్లాసిక్ 350: దీని ధర రూ.2,35,000 నుంచి రూ.2,11,500కి చేరుతుంది. అంటే రూ.23,500 తగ్గుతుంది.
హిమాలయన్ 450: దీని ధర రూ.2,85,000 నుంచి రూ.3,10,650 కి పెరుగుతుంది. అంటే రూ.25,650 పెరుగుతుంది.
గెరిల్లా 450: దీని ధర రూ.2,39,000 నుంచి రూ.2,60,500కి చేరుతుంది. అంటే రూ.21,510 పెరుగుతుంది.
స్క్రామ్ 440: దీని ధర రూ.2,08,000 నుంచి రూ.2,26,700కి చేరుతుంది. అంటే రూ.18,720 పెరుగుతుంది.












RRB Section Controller Recruitment 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) సెక్షన్ కంట్రోలర్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు.

RRB Section Controller Recruitment 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) సెక్షన్ కంట్రోలర్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు. రైల్వే శాఖలో ఉద్యోగం అనేది ఎంతో మందికి కలల ఉద్యోగం. తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ట్రాఫిక్ విభాగంలో Section Controller పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 368 ఖాళీలు ఉన్నాయని స్పష్టం చేశారు. గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

పోస్టుల విభజన – జోన్ వారీగా ఖాళీలు:

ప్రస్తుతం రైల్వే బోర్డు అన్ని జోన్‌ల నుండి Indent Management System ద్వారా ఖాళీల సమాచారం సేకరిస్తోంది. త్వరలో జోన్ వారీగా ఖాళీల విభజన కూడా అధికారికంగా విడుదల అవుతుంది.

అర్హత వివరాలు:

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అభ్యర్థులు కనీసం గ్రాడ్యుయేషన్ (Degree) పూర్తి చేసి ఉండాలి. ఏ స్ట్రీమ్ అయినా సరే, గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైతే చాలు.

దరఖాస్తు తేదీలు:

ప్రస్తుతం జోన్‌లతో ఇన్‌డెంట్ ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు ప్రారంభం మరియు ముగింపు తేదీలు త్వరలో RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తారు. మీరు రెగ్యులర్‌గా వెబ్‌సైట్‌ను లేదా ఈ పేజీని చెక్ చేస్తూ ఉండండి.

జీతభత్యాలు:

సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు అటాచ్ఛైన పే స్కేల్ ప్రస్తుతానికి RRB CEN ద్వారా ప్రకటించాల్సి ఉంది. అయితే సాధారణంగా ఈ పోస్టులకు లెవల్-6 లేదా లెవల్-7 పే స్కేల్ ఉండే అవకాశం ఉంది. మొదట్లోనే ₹65,000/- పైగా జీతం వచ్చే అవకాశం ఉంది.

అధికారిక వెబ్ సైట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

BMW Scooter : బీఎండబ్ల్యూ నుంచి హెల్మెట్ లేకుండా నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్.

BMW Scooter : బీఎండబ్ల్యూ నుంచి హెల్మెట్ లేకుండా నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్. BMW ఇప్పటికే అలాంటి హెల్మెట్ లేని రైడింగ్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ఆ కంపెనీ 2000, 2002 మధ్య C1 స్కూటర్‌ను తయారు చేసింది. దీనికి పైకప్పు, రోల్ కేజ్, సీట్‌బెల్ట్ ఉన్నాయి. ఆ సమయంలో అది బాగా అమ్ముడుపోకపోయినా బీఎండబ్ల్యూ.

BMW Scooter: IAA మొబిలిటీ 2025 షోలో BMW Motorrad తన కొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ విజన్ CEని ప్రవేశపెట్టింది. ఇది హెల్మెట్, రైడింగ్ గేర్ లేకుండా రైడర్ నడపగల స్కూటర్. ఈ కాన్సెప్ట్ BMW పాత C1 స్కూటర్ ఆధునిక, ఎలక్ట్రిక్ వెర్షన్.

ఈ స్కూటర్ అతిపెద్ద లక్షణం దాని మెటల్ ట్యూబులర్ సేఫ్టీ కేజ్. ఈ కేజ్ ఒక సేఫ్టీ సెల్‌ను ఏర్పరుస్తుంది. ఇది పడిపోవడం లేదా బోల్తా పడినప్పుడు రైడర్‌ను సురక్షితంగా ఉంచుతుంది. దీనికి సీట్‌బెల్ట్ వ్యవస్థ కూడా ఉంది. ఢీకొనే ప్రభావాన్ని తగ్గించడానికి దాని కేజ్‌పై ఫోమ్ ప్యాడింగ్ కూడా ఏర్పాటు చేసింది కంపెనీ.

సెల్ఫ్-బ్యాలెన్సింగ్ టెక్నాలజీ:

ఈ స్కూటర్‌లో గైరోస్కోప్‌లు, సెన్సార్లు, AI ఆధారిత సాఫ్ట్‌వేర్ సహకారంతో పనిచేసే సెల్ఫ్-బ్యాలెన్సింగ్ టెక్నాలజీని అందించారు. దీంతో వాహనం ఆగినప్పుడు కూడా ఎటువంటి స్టాండ్ అవసరం లేకుండా నిటారుగా నిలుస్తుంది. నగర ట్రాఫిక్‌లో సౌకర్యవంతంగా నడపడానికి, కొత్త రైడర్లకు భయాన్ని తగ్గించడానికి ఇది ఉపయుక్తంగా మారనుంది.

స్పెసిఫికేషన్లు:

కంపెనీ ఇంకా పూర్తిస్థాయి వివరాలు వెల్లడించలేదు. అయితే ఇది CE 04 ఆర్కిటెక్చర్పై నిర్మించింది. ఇది 42PS శక్తిని ఇస్తుంది. 0-50 కి.మీ వేగాన్ని కేవలం 2.6 సెకన్లలోనే చేరుకోగలదు. ఒక్కసారి చార్జ్ చేస్తే 130 కి.మీ రేంజ్ అందిస్తుంది.

BMW పాత ఆలోచనకు కొత్త రూపం:

ఇలాంటి హెల్మెట్-ఫ్రీ స్కూటర్ కాన్సెప్ట్ BMWకి కొత్తది కాదు. 2000-2002 మధ్య కంపెనీ C1 స్కూటర్ను తయారు చేసింది. అది మార్కెట్లో పెద్దగా విజయవంతం కాకపోయినా, ఆ ఆలోచనను వదలని BMW.. ఇప్పుడు విజన్ CEతో ఆధునిక టెక్నాలజీ, కొత్త డిజైన్ జోడించి మళ్లీ రంగంలోకి తెచ్చింది.

రూపకల్పన – Vision CE ముందు భాగంలో సంప్రదాయ శైలి ఉంది, సన్నని హెడ్‌ల్యాంప్‌లు కనిపిస్తాయి. రోల్ కేజ్‌లో అదనపు లైట్లు, చిన్న విండ్షీల్డ్ కలిగి ఉంటుంది. మధ్యన డెఫ్లెక్టర్‌లు కూడా అమర్చారు. సీటు, రక్షణ – సీటు బ్యాక్రెస్ట్, హెడ్రెస్ట్, సీటు బెల్ట్ కలిగి ఉంది. హెడ్రెస్ట్ పై మెటల్ మేష్ అమర్చారు. అదనపు రక్షణ కోసం ఇది దోహదపడుతుంది. ఇతర ఫీచర్లు చూస్తే.. పెద్ద డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రామినెంట్ ఫుట్‌రెస్ట్‌లు, కవర్ చేసిన ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉన్నాయి.

Bajaj Platina Launch New Bike : అదిరిపోయే లుతో బజాజ్ ప్లాటినా 125cc న్యూ బైక్ లాంచ్.

Bajaj Platina Launch New Bike : అదిరిపోయే లుతో బజాజ్ ప్లాటినా 125cc న్యూ బైక్ లాంచ్.అత్యధిక ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి బజాజ్ ప్లాటినా 125 కొత్త మోడల్‌ 2025 అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.

ప్రముఖ బజాజ్ కంపెనీ మార్కెట్‌లోకి తమ మరో కొత్త బైక్‌ను విడుదల చేయబోతోంది. ఇప్పటికే ఈ బైక్‌కి సంబంధించిన ఫీచర్స్‌, ఇతర వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ ఈ బైక్‌ ఏంటని అనుకుంటున్నారా? అదేంటో కాదు.. ప్లాటినా 125 కొత్త సిరీస్.. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్‌తో అందుబాటులోకి వస్తోంది.

బజాజ్ ప్లాటినా (Bajaj Platina) పేరు వినగానే మనసులోకి వచ్చే మొదటి విషయం తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్. 2006లో తొలిసారిగా మార్కెట్‌లోకి అడుగుపెట్టిన ఈ బైక్, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా తన స్థానాన్ని నిలబెట్టుకోవడం చిన్న విషయం కాదు. మారుతున్న ట్రెండ్స్, పెరుగుతున్న పోటీ మధ్య ప్లాటినా ఎందుకు తనదైన క్రేజ్‌ను కొనసాగించగలుగుతోంది అంటే, దాని వెనుక ఉన్న ప్రధాన కారణం సింప్లిసిటీ విత్ యూజ్‌ఫుల్ ఫీచర్స్. ప్రతి రోజు ఉద్యోగానికి వెళ్లే వారైనా, కాలేజీకి వెళ్లే స్టూడెంట్ అయినా, లేదా చిన్న వ్యాపారం చూసుకునే వ్యక్తి అయినా… ప్లాటినా అందరికీ సరిపోయే ఒక ఆప్షన్‌గా మారింది. తక్కువ ధరలో దొరకడం, పెట్రోల్ ధరలు ఎంత పెరిగినా భారం కాకుండా 70 నుండి 90 కి.మీ. పైగా మైలేజ్ ఇవ్వగలగడం దీని నిజమైన బలం.

డిజైన్ పరంగా ప్లాటినా చాలా సింపుల్‌గా ఉంటుంది, కానీ అదే సింప్లిసిటీ రైడింగ్‌లో కంఫర్ట్‌ని ఇస్తుంది. పొడవాటి సీటు, సాఫ్ట్ సస్పెన్షన్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ కలిపి ఇది ఒక జనాలు మెచ్చిన బైక్ అనే పేరుకు తగినట్టే నిలుస్తాయి. ప్రస్తుతం ఇది రెండు వేరియంట్లలో లభిస్తోంది. ప్లాటినా 100 ధర రూ.70,643 వద్ద అందుబాటులో ఉంటే, మరింత శక్తివంతమైన ప్లాటినా 110 మాత్రం రూ.74,694(ఎక్స్-షోరూమ్) ధరలో దొరుకుతుంది.

Jio Launch New Scooter: అతి తక్కువ ధరలో జియో న్యూ స్కూటర్ లాంచ్ 120 కి.మీ మైలేజీ తో.

Jio Launch New Scooter: అతి తక్కువ ధరలో జియో న్యూ స్కూటర్ లాంచ్ 120 కి.మీ మైలేజీ తో. ఇది భారత్ లో రోజువారీ ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని తయారు చేశారు. ఇది పెట్రోల్ స్కూటర్ కంటే ఐదు రెట్లు చౌకైనదని, వ్యక్తిగత రవాణాలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందని EV దిగ్గజం జియో తెలిపింది.

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ 2025లో ప్రయాణికుల కోసం ప్రత్యేక ఫీచర్లను రూపొందించారు. ఎక్కువ కాలం పనిచేసే బ్యాటరీ, అద్భుతమైన పనితీరును అందిస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ కోసం హోం ప్లగ్, బ్యాటరీ ఛేంజ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ ఫీచర్ల విషయానికొస్తే.. 4G LTE, యాప్ ఇంటిగ్రేషన్, జియో ఫెన్సింగ్ ఉంటుంది. తమ బడ్జెట్ లో స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే రైడర్లకు ఇది మంచి ఎంపిక.

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 120 కి.మీ ప్రయాణం:

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ పట్టణాల్లో ఉండే రైడర్లను దృష్టిలో ఉంచుకొని తయారు చేశారు . బ్యాగులు, ఇతర ఏదైనా సామాగ్రి పెట్టుకునేందుకు వీలుగా ఫ్లాట్ ఫుట్ బోర్డు ఉంటుంది. రైడర్, పిలియన్ ఇద్దరికీ సరిపోయే విశాలమైన కుషన్ సీటు ఉంటుంది. ఇండియాలో రోడ్లకు అనువుగా 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది.

ధర:

జియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.14,999 నుండి రూ.17,000 వరకు ఉంటుందని అంచనా. ఇంత తక్కువ ధరకు మార్కెట్ లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మడం లేదు. ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ ధర. ఈ స్కూటర్ యువతకు, మొదటిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ వాడేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది.

ఆన్‌లైన్ బుకింగ్:

ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు ఈ స్కూటర్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. రిజిస్ట్రేషన్ తర్వాత కొనుగోలుదారులకు ఒక నంబర్ ఇస్తారు. దాన్ని తీసుకొని దగ్గర్లోని జియో స్టోర్ నుండి స్కూటర్‌ను డెలివరీ తీసుకోవచ్చు. అయితే ఆన్ లైన్ లో స్కూటర్ బుకింగ్ ప్రాసెస్ ప్రారంభమైంది. కాని డెలివరీ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. 2025లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు వినియోగదారుల చేతికి అందవచ్చని తెలుస్తోంది.

vivo Y 500 Launched: వివో నుంచి 8200 mAh బ్యాటరీతో వాటర్ ప్రూఫ్ మొబైల్ మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.

vivo Y 500 Launched: వివో నుంచి 8200 mAh బ్యాటరీతో వాటర్ ప్రూఫ్ మొబైల్ మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.వివో తన సరికొత్త ఫోన్ Vivo Y500 ను చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్ 8,200mAh బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది 6.77-అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, 50MP ప్రధాన కెమెరాతో వస్తుంది.

వివో (Vivo) కంపెనీ నుంచి చైనా (China) మార్కెట్లో ఒక భారీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. అదే వివో Y500 5G (Vivo Y500 5G). ఇప్పుడు టెక్ సెక్టార్ ఫోకస్ దీనిపైనే ఉంది. ఎందుకంటే, ఈ డివైజ్‌లో ఒక కిల్లర్ ఫీచర్ ఉంది.. అదే దీని లార్జెస్ట్ బ్యాటరీ. ఏకంగా 8,200mAh కెపాసిటీతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్, వివో చరిత్రలోనే ఒక కొత్త రికార్డు సృష్టించబోతోంది. ప్రస్తుతం మనం వాడుతున్న హెవీ యాప్స్, ఫాస్ట్ ప్రాసెసర్‌ వల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే వివో ఈ Y500 ఫోన్‌ను తీసుకొస్తోంది.

బ్యాటరీలో సరికొత్త బెంచ్‌మార్క్:

Y500 5G ఫోన్‌లో ఏకంగా 8,200mAh బ్యాటరీ ఉంటుంది. గతేడాది వచ్చిన వివో Y300 (Vivo Y300) 6,500mAh బ్యాటరీతో పోలిస్తే ఇది చాలా పెద్ద జంప్. తమ ఫోన్లలో ఇదే అత్యంత లాంగెస్ట్ లాస్టింగ్ బ్యాటరీ అని కంపెనీ గర్వంగా చెబుతోంది. దీన్నిబట్టి చూస్తే, భవిష్యత్తులో ఫోన్లలో కూడా ట్యాబ్లెట్ సైజ్ బ్యాటరీలు ట్రెండ్‌గా మారొచ్చని తెలుస్తోంది.

లాంచ్ డేట్ ఫిక్స్:

వివో Y500 ఫోన్‌ను సెప్టెంబర్ 1న చైనాలో లాంచ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ చాలా స్ట్రాంగ్. దీనికి IP68, IP69, IP69+ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ ఉన్నాయి. వివో ఫోన్లలో ఇంత పవర్‌ఫుల్ వాటర్ రెసిస్టెన్స్ ఉన్న ఫోన్ ఇదే. అంతేకాదు, SGS గోల్డ్ లేబుల్ 5-స్టార్ డ్రాప్ టెస్టులు, మిలిటరీ-స్టాండర్డ్ టెస్టులను కూడా ఇది ఈజీగా పాసైంది. ఎలాంటి టఫ్ కండిషన్స్‌నైనా తట్టుకునేలా దీన్ని డిజైన్ చేశారు.

వివో Y500 ధర:

Vivo Y500 మొబైల్ 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 17,000గా కంపెనీ నిర్ణయించింది. అలాగే 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 19,700 గా ఉంది. అదే సమయంలో ఈ Vivo Y500  హ్యాండ్‌సెట్ 12GB ర్యామ్+ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,000గా ఉంది. దీని టాప్ మోస్ట్ వేరియంట్ 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,700 గా కంపెనీ నిర్ణయించింది. 

వివో Y500 స్పేస్:

Vivo Y500 స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది డ్యూయల్ సిమ్ (నానో + నానో)తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆరిజిన్ OS 15 పై నడుస్తుంది. Vivo Y500 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR సపోర్ట్‌తో 6.77-అంగుళాల ఫుల్ HD+ (2,392 x 1,080 పిక్సెల్స్) AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది.


ఏపీలో డైరీ ఫార్మ్ పెట్టె రైతులకు 75 శాతం రాయితీ, జస్ట్ రూ. 115 కడితే చాలు.

ఏపీలో డైరీ ఫార్మ్ పెట్టె రైతులకు 75 శాతం రాయితీ, జస్ట్ రూ. 115 కడితే చాలు. రాష్ట్ర ప్రభుత్వం డైరీ ఫార్మ్ రైతుల కోసం 75 శాతం రాయితీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది ఇది డైరీ ఫార్మ్ పెట్టాలి అనుకున్న వారికీ ఒక గొప్ప సదా అవకాశము అని చెప్ప వచ్చు.

ఏపీ రాష్ట్రంలో వ్యవసాయంతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతులు ఆదాయం పొందుతూ జీవనాన్ని సాగిస్తుంటారు. ఇక్కడి రైతులు పాడి పరిశ్రమపై ఎక్కువగా ఆధారపడి ఉంటారు. పాడి రైతుల కోసం ఏపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది.

భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులు ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటుంది. అలాంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో వ్యవసాయంతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతులు ఆదాయం పొందుతూ జీవనాన్ని సాగిస్తుంటారు. ఇక్కడి రైతులు పాడి పరిశ్రమపై ఎక్కువగా ఆధారపడి ఉంటారు. పాడి రైతుల కోసం ఏపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఏపీ పశుసంవర్ధక శాఖ రాయితీతో కూడిన దాణా, గడ్డి విత్తనాలు, వ్యాక్సిన్లు అందిస్తోంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. ప్రభుత్వం రైతులకు త్వరలోనే రాయితీతో గడ్డి కోత యంత్రాలను అందించనుంది.

ఇక పాడి రైతుల కోసం పశుగ్రాసం 75 శాతం రాయితీతో గడ్డి విత్తనాలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. 5 కిలోల గడ్డి విత్తనాలు ఉన్న బ్యాగ్ విలువ రూ.465 కాగా.. పశుసంవర్థక శాఖ పాడి రైతులకు దీనిని 75 శాతం రాయితీతో కేవలం రూ.115లకే అందిస్తోంది. అలాగే 50 శాతం రాయితీతో దాణా కూడా అందిస్తోంది. దీని కోసం ఏపీ రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్సులతో అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. రాయితీల కోసం పశువుల ఆస్పత్రులలో అయితే ఆస్పత్రి వైద్యులను, రైతు సేవా కేంద్రాలలో ఏహెచ్‌ఏలను సంప్రదించాల్సి ఉంటుంది.

test test test