AAI Junior Executive Recruitment 2025 : డిగ్రీ అర్హతతో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.

AAI Junior Executive Recruitment 2025

AAI Junior Executive Recruitment 2025 : డిగ్రీ అర్హతతో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు. ఎయిర్‌ పోర్ట్ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా (AAI).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 976 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 28వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్కిటెక్చర్‌, సివిల్‌, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్‌ 27, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

పోస్టుల వివరాలు:

  • జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ (ఆర్కిటెక్చర్‌) పోస్టుల సంఖ్య: 11
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ (సివిల్‌) పోస్టుల సంఖ్య: 199
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ (ఎలక్ట్రికల్) పోస్టుల సంఖ్య: 208
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్‌) పోస్టుల సంఖ్య: 527
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ (ఐటీ) పోస్టుల సంఖ్య: 31

పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో అంటే ఆర్కిటెక్చర్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి సెప్టెంబర్‌ 27, 2025వ తేదీ నాటికి తప్పనిసరిగా 27 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో గరిష్టంగా సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణ సెప్టెంబర్‌ 27, 2025వ తేదీ వరకు ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద రూ.300 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు. ఎంపికైన వారికి నెలకు జీతంగా రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

నోటిఫికేషన్ వివరాల లింక్ క్లిక్ చెయ్యండి

OLA New Scooter : ఓలా నుంచి వస్తున్న న్యూ స్కూటర్‌ కొత్త లుక్.

ola s1 pro sports electric scooter

OLA New Scooter : ఓలా నుంచి వస్తున్న న్యూ స్కూటర్‌ కొత్త లుక్.ఓలా ఎలక్ట్రిక్ తన సంకల్ప్ ఈవెంట్‌లో కొత్త S1 ప్రో స్పోర్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను (ola s1 pro sport electric scooter) విడుదల చేసింది. ఈ స్కూటర్ ధర రూ.1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది ఓలా S1 ప్రో స్కూటర్‌కు స్పోర్టీ వెర్షన్. కొనుగోలుదారులు రూ.999 తో ముందుగా బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు జనవరి 2026 లో మొదలవుతాయి.

కొత్త ఓలా S1 ప్రో స్పోర్ట్‌లో కొత్త 13kW మోటార్ ఉంది. ఇది 16kW పీక్ పవర్‌, 71Nm పీక్ టార్క్‌ను ఇస్తుంది. ఈ స్కూటర్ కేవలం 2 సెకన్లలో 0-40kmph వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 152kmph. ఈ మోటార్‌కు కొత్త 4,680 సెల్స్ తో చేసిన 5.2kWh బ్యాటరీ ప్యాక్ జత చేయబడింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ వరకు వెళ్తుంది.

డిజైన్, ఫీచర్లు:

S1 ప్రో స్పోర్ట్ డిజైన్ చాలా షార్ప్ గా ఉంది. ముందు చిన్న విండ్‌స్క్రీన్, కార్బన్-ఫైబర్ ఫ్రంట్ ఫెండర్, గ్రాబ్ రైల్, కొత్తగా రూపొందించిన సీటు ఉన్నాయి. ఇందులో కొత్త DRL సిగ్నేచర్ తో పూర్తి LED లైటింగ్ ఉంది.

సస్పెన్షన్, ఇతర ఫీచర్లు:

సస్పెన్షన్ కోసం ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్ ఉన్నాయి. ఈ స్కూటర్ 14-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో, పెద్ద టైర్లతో వస్తుంది. ఇది మంచి లుక్, మెరుగైన నియంత్రణను ఇస్తుంది. S1 ప్రో స్పోర్ట్ సీటు ఎత్తు 791mm, దాని కింద 34 లీటర్ల స్టోరేజ్ ఉంది.

ఓలా న్యూ స్కూటర్‌ వివరాలు కొరకు క్రింద లింక్ క్లిక్ చెయ్యండి

OLA new scooter more details

IOCL Apprentice recruitment : ఐఓసీల అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 475 జాబ్ ఖాళీలు.

iocl apprentice recruitment 2025

IOCL Apprentice recruitment : ఐఓసీల అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 475 జాబ్ ఖాళీలు.IOCL Apprentice Recruitment 2025 భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన మరియు ప్రఖ్యాత Indian Oil Corporation Limited (IOCL) 2025లో Apprentice Recruitment నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న యువతకు ఇది ఒక అద్భుతమైన సదా అవకాశం. IOCL అనేది దేశానికి ఇంధనం అందించే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఇక్కడ ఉద్యోగం లేదా శిక్షణ పొందడం అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, భవిష్యత్తు కెరీర్‌కు పునాది వంటిది.

ఈసారి IOCL Southern Region (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి) లో 475 Apprentice పోస్టులు భర్తీ చేయనుంది. ఇవి Trade Apprentice, Technician Apprentice, Graduate Apprentice కేటగిరీలలో ఉంటాయి.నియామకానికి సంబంధించిన ముఖ్య సమాచారం.

జాబ్ యొక్క సమాచారం:

సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)
ప్రకటన సంఖ్య: IOCL/MKTG/APPR/2025-26
మొత్తం ఖాళీలు: 475
పోస్టుల రకాలు:
Trade Apprentice
Technician Apprentice
Graduate Apprentice
అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 8, 2025
చివరి తేదీ: సెప్టెంబర్ 5, 2025

మరిన్ని వివరాల కొరకు క్రింది అధికారిక వెబ్సైట్ క్లిక్ చేయండి:

Apply for Apprentice

BSF Jobs: బీఎస్ఎఫ్ 1,121 హెడ్ కానిస్టేబుల్ జాబ్స్ ఆర్ ఓ అండ్ ఆర్ఎం పోస్టులు. 

bsf jobs apply

BSF Jobs: బీఎస్ఎఫ్ 1,121 హెడ్ కానిస్టేబుల్ జాబ్స్ ఆర్ ఓ అండ్ ఆర్ఎం పోస్టులు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) 1,121 హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్): 910 పోస్టులు, హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్): 211 పోస్టులు.

అర్హత ప్రమాణాలు:

హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్): అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ కోర్ సబ్జెక్టులుగా 12వ తరగతి లేదా రేడియో, ఎలక్ట్రానిక్స్ లేదా సంబంధిత రంగాలలో ITI సర్టిఫికెట్‌తో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్): అభ్యర్థులు ITI అర్హతతో 10వ తరగతి లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్‌తో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 24న ప్రారంభమై సెప్టెంబర్ 23న ముగుస్తుంది.

మరిన్ని వివరాలకు క్రింద లింక్ క్లిక్ చెయ్యండి

Online Apply for BSF Jobs

Yamaha MT-15 : యమహా ఎంటీ 15 కొత్త లుక్ తో మరిన్ని అదనంపు ఫీచర్స్.

yamaha new look bike price

Yamaha MT-15 : యమహా ఎంటీ 15 కొత్త లుక్ తో మరిన్ని అదనంపు ఫీచర్స్.యమహా ఎంటీ-15 V2.0 కొత్త లుక్ లో విడుదల అయింది. ఇది అనేక కొత్త ఫీచర్లతో పాటు కొత్త రంగులలో లభిస్తుంది. ఈ బైక్ లో ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, మరియు కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి.

కొత్త లుక్ మరియు ఫీచర్లు:

కొత్త రంగులు:

యమహా ఎంటీ-15 V2.0 ఐస్ స్టార్మ్, మెటాలిక్ సిల్వర్ సియాన్, మరియు మెటాలిక్ బ్లాక్ వంటి కొత్త రంగులలో లభిస్తుంది.

ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్:

ఈ బైక్ లో ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్ ఉంది, ఇది మెరుగైన కంప్రెషన్ మరియు రీబౌండ్ డంపింగ్ అందిస్తుంది.

అల్యూమినియం స్వింగ్ ఆర్మ్:

ఇది మరింత ప్రతిస్పందించే హ్యాండ్లింగ్‌కు సహాయపడుతుంది

కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్:

బైక్ లో కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది, ఇది బ్లూటూత్ Y-కనెక్ట్ యాప్ కు సపోర్ట్ చేస్తుంది.

స్ట్రీట్ ఫైటర్ డిజైన్:

ఎంటీ-15 V2.0 కి స్ట్రీట్ ఫైటర్ లుక్ ఇవ్వడానికి ట్విన్ హెడ్‌లాంప్ డిజైన్ మరియు మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి.

ప్రీమియం ఫీచర్లు:

వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్, డెల్టాబాక్స్ ఫ్రేమ్, మరియు అధిక-నాణ్యత గల మెటీరియల్స్ వంటి ప్రీమియం ఫీచర్లను కూడా కలిగి ఉంది.

ధర:

భారత్ లో ఎంటీ-15 V2.0 ప్రారంభ ధర రూ. 1.69 లక్షలు (ఎక్స్-షోరూమ్).

మరిన్ని వివరాల కొరకు క్రింద లిక్ క్లిక్ చెయ్యండి

Buy to get more information

Ather Rizta Electric Scooter : ఏథర్ రిజ్టా స్కూటర్ రూ. 29,001/- ధర తగ్గిన ఎలక్ట్రికల్ స్కూటర్ 160 కిలోమీటర్ మైలేజ్.. రూ. 2,152/- కే బుక్ చేసుకోండి.

ather-rizta-electric-scooter-price

Ather Rizta Electric Scooter : ఏథర్ రిజ్టా స్కూటర్ రూ. 29,001/- ధర తగ్గిన ఎలక్ట్రికల్ స్కూటర్ 160 కిలోమీటర్ మైలేజ్.. రూ. 2,152/- కే బుక్ చేసుకోండి. Ather Rizta Electric Scooter: మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవాలి అనుకుంటే.. ఇది సరైన టైమ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ స్కూటర్‌కి ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. లుక్ స్టైలిష్‌గా ఉంటుంది. మైలేజ్ బాగుంది. అన్ని రకాలుగా మంచి రేటింగ్ ఉంటుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

తగ్గింపు ధర వివరాలు:

ఆథర్ ఎనర్జీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిజ్టాను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఇది కుటుంబం మొత్తానికి ఉపయోగపడే స్కూటర్‌గా రూపొందింది. ఇటీవల, ఈ స్కూటర్ ధరను భారీగా తగ్గించారు. దీనితో రిజ్టా మరింత ఆకర్షణీయంగా మారింది. దీనికి డిమాండ్ పెరిగింది. బ్యాటరీ-ఆస్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్‌కి ధరను తగ్గించారు. తగ్గింపు తర్వాత స్కూటర్ ధర రూ.75,999 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ కొత్త అప్‌డేట్ రిజ్టాను మరింత బెస్ట్ ఆప్షన్‌గా చేసింది.

ఆథర్ రిజ్టా రెండు ప్రధాన వేరియంట్లలో లభిస్తుంది: రిజ్టా S, రిజ్టా Z. BaaS మోడల్‌తో రిజ్టా S ధర రూ.75,999 నుంచి ప్రారంభమవుతుంది, అయితే సాధారణ ధరలు రూ.1,14,640 నుంచి రూ.1,60,046 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. రిజ్టా S 2.9 kWh బ్యాటరీతో రూ. 1,17,000 దగ్గర మొదలవుతుంది, రిజ్టా Z 3.7 kWh వేరియంట్ రూ. 1,71,000 వరకు ఉంటుంది.

మరిన్ని వివరాలు కొరకు క్రింద లిక్ క్లిక్ చెయ్యండి

Ather Rizta Electric Scooter

Lic jobs: అదిరిపోయే శాలరీతో ఎల్ఐసి లో జాబ్ 80 వేలకు పైగా శాలరీ త్వరగా అప్లై చేసుకోండి.

lic jobs recruitment 2025

Lic jobs: అదిరిపోయే శాలరీతో ఎల్ఐసి లో జాబ్ 80 వేలకు పైగా శాలరీ త్వరగా అప్లై చేసుకోండి. LIC Recruitment: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు శుభవార్త ఉంది. LIC తాజాగా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) మరియు అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టుల కోసం ఖాళీలను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగాలను కోరుకునే యువతీ యువకులు, స్టూడెంట్స్ మరియు ఉద్యోగార్హులు ఈ నియామక ప్రకటనను గమనించి దరఖాస్తు చేసుకోవచ్చు. LIC ప్రభుత్వ సంస్థ కావడం వల్ల, ఈ ఉద్యోగాలు స్థిరమైన జీతం, వృద్ధి అవకాశాలు మరియు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను కూడా అందిస్తాయి.

ఈ నియామక ప్రకటన కింద మొత్తం 841 ఖాళీలను భర్తీ చేయడం లక్ష్యం. అభ్యర్థులు ఈ రోజు నుండి LIC అధికారిక వెబ్‌సైట్ licindia.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 8, 2025. దరఖాస్తు చేసుకునే ముందు, అభ్యర్థులు అన్ని అర్హతలు, వయోపరిమితులు, రుసుములు మరియు ఇతర షరతులను జాగ్రత్తగా పరిశీలించాలి.

LIC లో భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలు:

1)అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) స్పెషలిస్ట్: 410 పోస్టులు.

2)అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO-జనరలిస్ట్): 350 పోస్టులు.

3)అసిస్టెంట్ ఇంజనీర్లు: 81 పోస్టులు.

వయోపరిమితి:

ఆగస్టు 1, 2025 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

LIC రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు వివరాలు:

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ :- 16-ఆగస్టు-25 నుండి ప్రారంభమవుతుంది
  • రిజిస్ట్రేషన్ & ఫీజు కోసం చివరి తేదీ:- 8-సెప్టెంబర్-25
  • పరీక్షకు 7 రోజుల ముందు కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
  • ప్రిలిమ్స్ పరీక్ష (తాత్కాలిక): 10-సెప్టెంబర్-25
  • మెయిన్స్ పరీక్ష (తాత్కాలిక): 8-నవంబర్-25

LIC రిక్రూట్‌మెంట్ 2025 దరఖాస్తు చేసుకొనే విధానం:

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే:

  • అధికారిక వెబ్‌సైట్, licindia.in ని ఓపెన్ చేయండి.
  • హోమ్‌పేజీలో, AAO జనరలిస్ట్/స్పెషలిస్ట్ లేదా అసిస్టెంట్ ఇంజనీర్ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసి, లాగిన్ అవ్వండి.
  • దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేయండి.
  • అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించాలి.
  • ఫారమ్‌ను సబ్‌మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.

LIC రిక్రూట్‌మెంట్ 2025 అప్లికేషన్ ఫీజు యొక్క వివరాలు:

కాస్ట్ వారీగా కేటగిరీలు అప్లికేషన్ ఫీజులు వివరాలు ఇలా ఉన్నాయి.

SC/ST/PwBD కేటగిరీ అభ్యర్థులు ₹85 + లావాదేవీ ఛార్జీలు + GST కలిపి చెల్లించాలి, ఇతర అభ్యర్థులు ₹700 + లావాదేవీ ఛార్జీలు + GST చెల్లించాల్సి ఉంటుంది.

AAO ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్ , ఇంటర్వ్యూ, ఆ తర్వాత ప్రీ-రిక్రూట్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. ప్రిలిమ్స్ (ఫేజ్ 1)లో సాధించిన మార్కులు ఫైనల్ సెలెక్షన్ లిస్ట్‌కు పరిగణించబడవు.

TVS Jupiter 125 : టీవీఎస్ నుంచి వస్తున్న మార్కొనక స్కూటర్ టీవీఎస్ జూపిటర్.

TVS Jupiter 125 : టీవీఎస్ నుంచి వస్తున్న మార్కొనక స్కూటర్ టీవీఎస్ జూపిటర్. టీవీఎస్ జూపిటర్ సమాచారం:

TVS Jupiter 125 DT SXC Scooter: ఇందులో స్కూటర్‌లో LED హెడ్‌ల్యాంప్, అతి పొడవైన సీటు, స్మార్ట్ డిజిటల్ కన్సోల్, కాల్‌, SMS హెచ్చరికలు, రియల్ టైమ్ సగటు మైలేజ్ సూచిక, తక్కువ ఇంధన హెచ్చరిక ఇండికేటర్‌.

టీవీఎస్ జూపిటర్ ధర విలువ:

TVS మోటార్ కంపెనీ ఇటీవల సోషల్ మీడియాలో చాలా కార్యాచరణను ప్రదర్శించింది. ఆ కంపెనీ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఒకదాని తర్వాత ఒకటిగా అనేక టీజర్‌లను విడుదల చేసింది. దీనిలో జూపిటర్ 125 కొత్త వెర్షన్ ఉంది. ఈ టీజర్ల శ్రేణి ఇప్పుడు జూపిటర్ 125 కొత్త వేరియంట్ ‘DT SXC’ విడుదలతో ముగిసింది. ఆ కంపెనీ తన బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ ‘టీవీఎస్ జూపిటర్ 125’లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్‌లో కొన్ని ప్రత్యేక ఫీచర్లను చేర్చింది. దీని ప్రారంభ ధర రూ. 88,942 (ఎక్స్-షోరూమ్).

టీవీఎస్ జూపిటర్ యొక్క కలర్:

జూపిటర్ 125 DT SXC లో ప్రత్యేకత ఏమిటి?: అయితే, లుక్, డిజైన్ పరంగా ఈ స్కూటర్ ఇతర వేరియంట్లలో చాలా వరకు పోలి ఉంటుంది. కానీ మిగిలిన వాటి నుండి దీనిని వేరు చేసే కొన్ని అద్భుతమైన అప్‌డేట్‌లు ఉన్నాయి. ఇది రెండు కొత్త డ్యూయల్-టోన్ రంగుల ఎంపికను కలిగి ఉంది. వీటిలో ఐవరీ బ్రౌన్, ఐవరీ గ్రే రంగులు ఉన్నాయి. దీనితో పాటు కంపెనీ ఫ్లాట్ సింగిల్-పీస్ సీటు మాదిరిగానే డ్యూయల్-టోన్ ఇన్నర్ ప్యానెల్‌లను కూడా జోడించింది. దగ్గరగా పరిశీలిస్తే, దీనికి 3D చిహ్నం, బాడీ-రంగు గ్రాబ్ రైల్ కూడా లభిస్తుంది.

టీవీఎస్ జూపిటర్ ఫీచర్స్:

ఈ కొత్త వేరియంట్ ధర మిడ్-స్పెక్ డిస్క్ వేరియంట్ కంటే రూ. 3,500 ఎక్కువ, కొత్త ఫీచర్లతో వస్తుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో వచ్చే కలర్ LCD డిస్‌ప్లే ఉంటుంది. దీనితో పాటు, టర్న్-బై-టర్న్ నావిగేషన్ సౌకర్యం కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఈ కొత్త వేరియంట్ విడుదలతో, జూపిటర్ ఇప్పుడు మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీని బేస్ వేరియంట్ ధర రూ. 80,740 నుండి ప్రారంభమై టాప్ వేరియంట్ స్మార్ట్ కనెక్ట్ ధర రూ. 92,001 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

టీవీఎస్ జూపిటర్ ఇంజిన్ సామర్థ్యం:

టీవీఎస్ జూపిటర్ 125 లో కంపెనీ 124.8 సిసి సామర్థ్యం గల సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఇచ్చింది. ఇది 8 HP పవర్, 11 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ నిరంతర వేరియబుల్ ట్రాన్స్మిషన్ (CVT) కి జతచేయబడి ఉంటుంది. కంపెనీ తన ఇంజిన్‌ను ఇంతకు ముందు కంటే మెరుగ్గా ట్యూన్ చేసిందని, మైలేజ్ కూడా 15% పెరిగిందని పేర్కొంది. అయితే, కంపెనీ ఎటువంటి మైలేజ్ వివరాలను వెల్లడించలేదు.

టీవీఎస్ జూపిటర్ స్పెసిఫికేషన్:

ఇందులో స్కూటర్‌లో LED హెడ్‌ల్యాంప్, అతి పొడవైన సీటు, స్మార్ట్ డిజిటల్ కన్సోల్, కాల్‌, SMS హెచ్చరికలు, రియల్ టైమ్ సగటు మైలేజ్ సూచిక, తక్కువ ఇంధన హెచ్చరిక ఇండికేటర్‌, ముందు భాగంలో ఇంధనం నింపే సెటప్, 33 లీటర్ల సీటు కింద నిల్వ సామర్థ్యం, 2 లీటర్ల ఫ్రంట్ గ్లోవ్ బాక్స్. దీని బరువు 108 కిలోలు.

Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ గెలాక్సీ S26 6జి నెటవర్క్ తో మార్కెట్ లో వచ్చేస్తుంది.

Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ గెలాక్సీ S26 6జి నెటవర్క్ తో మార్కెట్ లో వచ్చేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S26 సమాచారం:

కొత్త శాంసంగ్ ఫోన్ వచ్చేస్తుంది. వచ్చే 2026 జనవరిలో ఈ శాంసంగ్ అల్ట్రా ఫోన్ లాంచ్ కానుంది. 16GB ర్యామ్ (Samsung Galaxy S26 Ultra) వేరియంట్ యొక్క ధర కేవలం రూ. 1,59,990 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా ఉండొచ్చు . ప్రత్యేకించి 6G స్పీడ్ నెట్‌వర్క్ టెక్నాలజీతో రానుంది. లీక్‌ల ఆధారంగా శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.

శాంసంగ్ గెలాక్సీ S26 ధర మరియు మార్కెట్లోకి వచ్చే అంచనా:

భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S26, గెలాక్సీ S25 ఎడ్జ్, గెలాక్సీ S26 అల్ట్రా వంటి శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్‌లు జనవరి 2026 నాటికి మార్కెట్లోకి ప్రారంభం అవుతాయని ఒక అంచనా ఉంది . ధరల విషయానికి వస్తే గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ 16GB రామ్ వేరియంట్‌, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ. 1,59,990 ప్రారంభం ధరకు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. శాంసంగ్ ప్రారంభం సమయంలో అధికారిక ధరలు మరోలా ఉండొచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S26 ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్:

శాంసంగ్ గెలాక్సీ డిజైన్:

గెలాక్సీ S26 అల్ట్రా ఏకీకృత కెమెరా ద్వీపంతో కూడిన కొత్త డిజైన్‌ను కలిగి ఉండవచ్చు. S26 అల్ట్రా 7mm కంటే తక్కువ మందంతో సన్నగా ఉండే అవకాశం ఉంది, మరియు మరింత సన్నని బెజెల్స్ తో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ కెమెరా:

200MP సోనీ సెన్సార్‌తో కూడిన కెమెరా అప్‌గ్రేడ్‌ను కలిగి ఉంటుంది, మెరుగైన టెలిఫోటో లెన్స్‌లు ఉంటాయి. అండర్-డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా కూడా ఉండవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ప్రాసెసర్:

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 2 చిప్‌సెట్ లేదా ఎక్సినోస్ 2600 చిప్‌సెట్‌ను ఉపయోగించవచ్చు. S26 అల్ట్రా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 2 చిప్‌సెట్ యొక్క ఓవర్‌లాక్ చేసిన వెర్షన్‌ను ఉపయోగించవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ బ్యాటరీ పనితీరు:

5500mAh బ్యాటరీతో రానుంది, మరియు వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. S26 అల్ట్రా 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ డిస్‌ప్లే:

COE OLED డిస్‌ప్లే టెక్నాలజీతో రావచ్చు, ఇది మెరుగైన రంగులు, స్పష్టత మరియు సామర్థ్యాన్ని అందిస్తుంది.

ఇతర ఫీచర్లు:

పెద్ద వేపర్ ఛాంబర్, మెరుగైన థర్మల్స్, థర్డ్ జనరేషన్ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉండవచ్చు.

తెలుగు తాజా న్యూస్ ఫాలోవర్స్ కి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

తెలుగు తాజా న్యూస్ ఫాలోవర్స్ కి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం:

ఆగస్టు పదిహేను భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోబడుతోంది. 1947 ఆగస్టు 15 వ రోజు భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వా నుంచి విడుదలయింది. దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతరం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15 వ రోజు భారత స్వాతంత్ర్య దినోత్సవంగా, జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది.

భారతదేశచరిత్ర:

భారతదేశాన్ని బ్రిటీష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన క్రిందకు, కొన్ని రాజ్యాలను తమ ప్రభావం క్రిందకు తీసుకువచ్చారు. 19వ శతాబ్ది తొలినాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. 1858 వరకూ భారత దేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్నా 19వ శతాబ్ది తొలినాళ్ళ నుంచే వారి ప్రాభవం తగ్గుతూ వచ్చింది. చివరకు 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం జరిగి దానిలో సిపాయిలు, రాజులు ఓడిపోయాక 1858లో బ్రిటీష్ రాణి భారత సామ్రాజ్యధినేత్రి అయ్యాక దేశం బ్రిటీష్ పాలన కిందకి వచ్చింది. బ్రిటీష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ, భారతీయ స్వాతంత్ర్య పోరాటాల ఫలంగానూ దేశానికి 1947 ఆగస్టు 14న అర్థరాత్రి సమయంలో స్వాతంత్ర్యం వచ్చింది భారత్ మాతాకీ జై .

భారతదేశ తేదీ ప్రాధాన్యత:

బ్రిటీష్ ఇండియా ఆఖరు గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ 1948లో నిర్ణీతమైన స్వాతంత్ర్య దినాన్ని ముందుకు జరుపుతూ 1947 ఆగస్టు 15 వ రోజు జరగాలని నిర్ణయించారు. రెండవ ప్రపంచయుద్ధం జపాన్ లొంగుబాటుతో ముగిసిపోయిన రోజు ఆగస్టు 15 వ రోజు కావడంతో భారత స్వాతంత్ర్యానికి దానిని ఎంచుకున్నారు.

భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు:

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద వైభవం గా జరుగుతాయి. మొదటి స్వాతంత్ర్య దినోత్సవం నాడు రాత్రి సమయంలో నెహ్రూ మాట్లాడిన మాటలివి:అనేక సంవత్సరాల క్రితమే మన భవితవ్యం గురించిన గమ్యస్థానాన్ని చేరుకొని తీరాలని మనం నిర్ణయించాం. మన ఈ నిర్ణయాన్ని పూర్తిగా, కూలంకషంగా సాధించే సమయం ఇప్పుడు ఆసన్నమయింది. అర్థరాత్రి పన్నెండు గంటలు కొట్టగానే, ప్రపంచమంతా నిద్రాదేవి ఒడిలో పారవశ్యం చెందివున్న సమయాన, భారతదేశం, పునరుజ్జీవనంతో, స్వేచ్ఛగా స్వతంత్రదేశంగా ఆవిర్భవిస్తుంది.

జై హింద్


test test test