Lic jobs: అదిరిపోయే శాలరీతో ఎల్ఐసి లో జాబ్ 80 వేలకు పైగా శాలరీ త్వరగా అప్లై చేసుకోండి.

Lic jobs: అదిరిపోయే శాలరీతో ఎల్ఐసి లో జాబ్ 80 వేలకు పైగా శాలరీ త్వరగా అప్లై చేసుకోండి. LIC Recruitment: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు శుభవార్త ఉంది. LIC తాజాగా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) మరియు అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టుల కోసం ఖాళీలను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగాలను కోరుకునే యువతీ యువకులు, స్టూడెంట్స్ మరియు ఉద్యోగార్హులు ఈ నియామక ప్రకటనను గమనించి దరఖాస్తు చేసుకోవచ్చు. LIC ప్రభుత్వ సంస్థ కావడం వల్ల, ఈ ఉద్యోగాలు స్థిరమైన జీతం, వృద్ధి అవకాశాలు మరియు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను కూడా అందిస్తాయి.

ఈ నియామక ప్రకటన కింద మొత్తం 841 ఖాళీలను భర్తీ చేయడం లక్ష్యం. అభ్యర్థులు ఈ రోజు నుండి LIC అధికారిక వెబ్‌సైట్ licindia.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 8, 2025. దరఖాస్తు చేసుకునే ముందు, అభ్యర్థులు అన్ని అర్హతలు, వయోపరిమితులు, రుసుములు మరియు ఇతర షరతులను జాగ్రత్తగా పరిశీలించాలి.

LIC లో భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలు:

1)అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) స్పెషలిస్ట్: 410 పోస్టులు.

2)అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO-జనరలిస్ట్): 350 పోస్టులు.

3)అసిస్టెంట్ ఇంజనీర్లు: 81 పోస్టులు.

వయోపరిమితి:

ఆగస్టు 1, 2025 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

LIC రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు వివరాలు:

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ :- 16-ఆగస్టు-25 నుండి ప్రారంభమవుతుంది
  • రిజిస్ట్రేషన్ & ఫీజు కోసం చివరి తేదీ:- 8-సెప్టెంబర్-25
  • పరీక్షకు 7 రోజుల ముందు కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
  • ప్రిలిమ్స్ పరీక్ష (తాత్కాలిక): 10-సెప్టెంబర్-25
  • మెయిన్స్ పరీక్ష (తాత్కాలిక): 8-నవంబర్-25

LIC రిక్రూట్‌మెంట్ 2025 దరఖాస్తు చేసుకొనే విధానం:

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే:

  • అధికారిక వెబ్‌సైట్, licindia.in ని ఓపెన్ చేయండి.
  • హోమ్‌పేజీలో, AAO జనరలిస్ట్/స్పెషలిస్ట్ లేదా అసిస్టెంట్ ఇంజనీర్ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసి, లాగిన్ అవ్వండి.
  • దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేయండి.
  • అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించాలి.
  • ఫారమ్‌ను సబ్‌మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.

LIC రిక్రూట్‌మెంట్ 2025 అప్లికేషన్ ఫీజు యొక్క వివరాలు:

కాస్ట్ వారీగా కేటగిరీలు అప్లికేషన్ ఫీజులు వివరాలు ఇలా ఉన్నాయి.

SC/ST/PwBD కేటగిరీ అభ్యర్థులు ₹85 + లావాదేవీ ఛార్జీలు + GST కలిపి చెల్లించాలి, ఇతర అభ్యర్థులు ₹700 + లావాదేవీ ఛార్జీలు + GST చెల్లించాల్సి ఉంటుంది.

AAO ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్ , ఇంటర్వ్యూ, ఆ తర్వాత ప్రీ-రిక్రూట్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. ప్రిలిమ్స్ (ఫేజ్ 1)లో సాధించిన మార్కులు ఫైనల్ సెలెక్షన్ లిస్ట్‌కు పరిగణించబడవు.

Leave a Comment