Indian Air Force Agniveer Recruitment 2025 : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో టెన్త్, ఇంటర్ అర్హతతో అగ్నివీర్ జాబ్స్. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ ర్యాలీ నోటిఫికేషన్ వచ్చింది. టెన్త్, ఇంటర్ చదివిన యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ.30 వేలకుపైగా జీతం లభిస్తుంది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)లో అగ్నీవీర్ వాయు పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ర్యాలీలు జలంధర్, వడోదరా, బరిపాడా, చెన్నై, ముంబై నగరాల్లో ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 14, 2025 వరకు నిర్వహించబడతాయి. అయితే వీటికి అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి.ర్యాలీ తేదీలు
ర్యాలీ తేదీలు:
- జలంధర్, పంజాబ్ ఆగస్టు 27 – ఆగస్టు 31, 2025
- వడోదరా, గుజరాత్ ఆగస్టు 27 – ఆగస్టు 31, 2025
- బరిపాడా, ఒడిషా ఆగస్టు 27 – సెప్టెంబర్ 03, 2025
- చెన్నై, తమిళనాడు ఆగస్టు 27 – సెప్టెంబర్ 06, 2025
- ముంబై, మహారాష్ట్ర సెప్టెంబర్ 09 – సెప్టెంబర్ 13, 2025
అర్హతలు:
- జనవరి 1, 2005 నుంచి జూలై 1, 2008 మధ్య జన్మించి ఉండాలి.
- ఎంపిక సమయంలో గరిష్ట వయస్సు: 21 ఏళ్లు
- నాలుగు సంవత్సరాల సర్వీస్ కాలంలో పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉండదు
- మహిళలు గర్భవతి కాకుండా ఉండాలి. రూల్స్ పాటించకపోతే విధుల నుంచి తొలగింపు
విద్యార్హత:
- 10+2 / ఇంటర్ – కనీసం 50% ఓవరాల్, 50% ఇంగ్లీష్‌లో
- లేదా 2 సంవత్సరాల వొకేషనల్ కోర్సు – 50% ఓవరాల్, 50% ఇంగ్లీష్‌లో
- లేదా 3 సంవత్సరాల డిప్లొమా (ఇంజనీరింగ్: మెకానికల్, ఎలక్ట్రికల్, IT మొదలైనవి) – 50% ఓవరాల్, 50% ఇంగ్లీష్‌లో
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి