ఏపీలో డైరీ ఫార్మ్ పెట్టె రైతులకు 75 శాతం రాయితీ, జస్ట్ రూ. 115 కడితే చాలు. రాష్ట్ర ప్రభుత్వం డైరీ ఫార్మ్ రైతుల కోసం 75 శాతం రాయితీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది ఇది డైరీ ఫార్మ్ పెట్టాలి అనుకున్న వారికీ ఒక గొప్ప సదా అవకాశము అని చెప్ప వచ్చు.
ఏపీ రాష్ట్రంలో వ్యవసాయంతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతులు ఆదాయం పొందుతూ జీవనాన్ని సాగిస్తుంటారు. ఇక్కడి రైతులు పాడి పరిశ్రమపై ఎక్కువగా ఆధారపడి ఉంటారు. పాడి రైతుల కోసం ఏపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది.
భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులు ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటుంది. అలాంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో వ్యవసాయంతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతులు ఆదాయం పొందుతూ జీవనాన్ని సాగిస్తుంటారు. ఇక్కడి రైతులు పాడి పరిశ్రమపై ఎక్కువగా ఆధారపడి ఉంటారు. పాడి రైతుల కోసం ఏపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఏపీ పశుసంవర్ధక శాఖ రాయితీతో కూడిన దాణా, గడ్డి విత్తనాలు, వ్యాక్సిన్లు అందిస్తోంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. ప్రభుత్వం రైతులకు త్వరలోనే రాయితీతో గడ్డి కోత యంత్రాలను అందించనుంది.
ఇక పాడి రైతుల కోసం పశుగ్రాసం 75 శాతం రాయితీతో గడ్డి విత్తనాలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. 5 కిలోల గడ్డి విత్తనాలు ఉన్న బ్యాగ్ విలువ రూ.465 కాగా.. పశుసంవర్థక శాఖ పాడి రైతులకు దీనిని 75 శాతం రాయితీతో కేవలం రూ.115లకే అందిస్తోంది. అలాగే 50 శాతం రాయితీతో దాణా కూడా అందిస్తోంది. దీని కోసం ఏపీ రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్సులతో అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. రాయితీల కోసం పశువుల ఆస్పత్రులలో అయితే ఆస్పత్రి వైద్యులను, రైతు సేవా కేంద్రాలలో ఏహెచ్‌ఏలను సంప్రదించాల్సి ఉంటుంది.