APMSRB Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు 185 ఉద్యోగాలు. APMSRB medical jobs 2025: నిరుద్యోగ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APMSRB) శుభవార్త! నోటిఫికేషన్ నం. 08/2025 ప్రకారం, ఒప్పంద ప్రాతిపదికన 185 జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెప్టెంబరు 10, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశం ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి లక్షల్లో వేతనంతో గొప్ప అవకాశం.
ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీలు: 185
- జనరల్ ఫిజీషియన్ (టెలీ మెడిసిన్ హబ్): 13 పోస్టులు
- గైనకాలజిస్ట్ (టెలీ మెడిసిన్ హబ్): 03 పోస్టులు
- పీడియాట్రిషియన్ (DEICs): 14 పోస్టులు (అర్బన్ & రూరల్: 10, ట్రైబల్: 4)
- మెడికల్ ఆఫీసర్ (UPHCs/UAAMs/DEICs/టెలీ మెడిసిన్ హబ్స్): 155 పోస్టులు
విద్యార్హత:
- జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్: ఎంబీబీఎస్ + సంబంధిత స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా + APMC రిజిస్ట్రేషన్.
- మెడికల్ ఆఫీసర్: ఎంబీబీఎస్ + APMC రిజిస్ట్రేషన్.
వయో పరిమితి (నోటిఫికేషన్ తేదీ నాటికి):
• OC అభ్యర్థులు: 42 సంవత్సరాలు.
• EWS/SC/ST/BC అభ్యర్థులు: 47 సంవత్సరాలు.
• వికలాంగులు: 52 సంవత్సరాలు.
• మాజీ సైనికులు: 50 సంవత్సరాలు.