BMW Scooter : బీఎండబ్ల్యూ నుంచి హెల్మెట్ లేకుండా నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్. BMW ఇప్పటికే అలాంటి హెల్మెట్ లేని రైడింగ్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ఆ కంపెనీ 2000, 2002 మధ్య C1 స్కూటర్‌ను తయారు చేసింది. దీనికి పైకప్పు, రోల్ కేజ్, సీట్‌బెల్ట్ ఉన్నాయి. ఆ సమయంలో అది బాగా అమ్ముడుపోకపోయినా బీఎండబ్ల్యూ.
BMW Scooter: IAA మొబిలిటీ 2025 షోలో BMW Motorrad తన కొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ విజన్ CEని ప్రవేశపెట్టింది. ఇది హెల్మెట్, రైడింగ్ గేర్ లేకుండా రైడర్ నడపగల స్కూటర్. ఈ కాన్సెప్ట్ BMW పాత C1 స్కూటర్ ఆధునిక, ఎలక్ట్రిక్ వెర్షన్.
ఈ స్కూటర్ అతిపెద్ద లక్షణం దాని మెటల్ ట్యూబులర్ సేఫ్టీ కేజ్. ఈ కేజ్ ఒక సేఫ్టీ సెల్‌ను ఏర్పరుస్తుంది. ఇది పడిపోవడం లేదా బోల్తా పడినప్పుడు రైడర్‌ను సురక్షితంగా ఉంచుతుంది. దీనికి సీట్‌బెల్ట్ వ్యవస్థ కూడా ఉంది. ఢీకొనే ప్రభావాన్ని తగ్గించడానికి దాని కేజ్‌పై ఫోమ్ ప్యాడింగ్ కూడా ఏర్పాటు చేసింది కంపెనీ.
సెల్ఫ్-బ్యాలెన్సింగ్ టెక్నాలజీ:
ఈ స్కూటర్‌లో గైరోస్కోప్‌లు, సెన్సార్లు, AI ఆధారిత సాఫ్ట్‌వేర్ సహకారంతో పనిచేసే సెల్ఫ్-బ్యాలెన్సింగ్ టెక్నాలజీని అందించారు. దీంతో వాహనం ఆగినప్పుడు కూడా ఎటువంటి స్టాండ్ అవసరం లేకుండా నిటారుగా నిలుస్తుంది. నగర ట్రాఫిక్‌లో సౌకర్యవంతంగా నడపడానికి, కొత్త రైడర్లకు భయాన్ని తగ్గించడానికి ఇది ఉపయుక్తంగా మారనుంది.
స్పెసిఫికేషన్లు:
కంపెనీ ఇంకా పూర్తిస్థాయి వివరాలు వెల్లడించలేదు. అయితే ఇది CE 04 ఆర్కిటెక్చర్పై నిర్మించింది. ఇది 42PS శక్తిని ఇస్తుంది. 0-50 కి.మీ వేగాన్ని కేవలం 2.6 సెకన్లలోనే చేరుకోగలదు. ఒక్కసారి చార్జ్ చేస్తే 130 కి.మీ రేంజ్ అందిస్తుంది.
BMW పాత ఆలోచనకు కొత్త రూపం:
ఇలాంటి హెల్మెట్-ఫ్రీ స్కూటర్ కాన్సెప్ట్ BMWకి కొత్తది కాదు. 2000-2002 మధ్య కంపెనీ C1 స్కూటర్ను తయారు చేసింది. అది మార్కెట్లో పెద్దగా విజయవంతం కాకపోయినా, ఆ ఆలోచనను వదలని BMW.. ఇప్పుడు విజన్ CEతో ఆధునిక టెక్నాలజీ, కొత్త డిజైన్ జోడించి మళ్లీ రంగంలోకి తెచ్చింది.
రూపకల్పన – Vision CE ముందు భాగంలో సంప్రదాయ శైలి ఉంది, సన్నని హెడ్‌ల్యాంప్‌లు కనిపిస్తాయి. రోల్ కేజ్‌లో అదనపు లైట్లు, చిన్న విండ్షీల్డ్ కలిగి ఉంటుంది. మధ్యన డెఫ్లెక్టర్‌లు కూడా అమర్చారు. సీటు, రక్షణ – సీటు బ్యాక్రెస్ట్, హెడ్రెస్ట్, సీటు బెల్ట్ కలిగి ఉంది. హెడ్రెస్ట్ పై మెటల్ మేష్ అమర్చారు. అదనపు రక్షణ కోసం ఇది దోహదపడుతుంది. ఇతర ఫీచర్లు చూస్తే.. పెద్ద డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రామినెంట్ ఫుట్‌రెస్ట్‌లు, కవర్ చేసిన ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉన్నాయి.