AAI Junior Executive Recruitment 2025 : డిగ్రీ అర్హతతో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.

AAI Junior Executive Recruitment 2025 : డిగ్రీ అర్హతతో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు. ఎయిర్‌ పోర్ట్ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా (AAI).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 976 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 28వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్కిటెక్చర్‌, సివిల్‌, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్‌ 27, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

పోస్టుల వివరాలు:

  • జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ (ఆర్కిటెక్చర్‌) పోస్టుల సంఖ్య: 11
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ (సివిల్‌) పోస్టుల సంఖ్య: 199
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ (ఎలక్ట్రికల్) పోస్టుల సంఖ్య: 208
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్‌) పోస్టుల సంఖ్య: 527
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ (ఐటీ) పోస్టుల సంఖ్య: 31

పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో అంటే ఆర్కిటెక్చర్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి సెప్టెంబర్‌ 27, 2025వ తేదీ నాటికి తప్పనిసరిగా 27 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో గరిష్టంగా సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణ సెప్టెంబర్‌ 27, 2025వ తేదీ వరకు ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద రూ.300 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు. ఎంపికైన వారికి నెలకు జీతంగా రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

నోటిఫికేషన్ వివరాల లింక్ క్లిక్ చెయ్యండి

Leave a Comment