royal enfield hunter 350 : యూత్ మోడల్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రెట్రో లుక్స్.royal enfield hunter 350 : యూత్ మోడల్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రెట్రో లుక్స్. Royal Enfield Hunter: రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైక్ యువత బాగా ఆకట్టుకుంటుంది. దీని శక్తివంతమైన ఇంజిన్, ఫీచర్స్ చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. అయితే, దీని ధర దాదాపు రూ. 1.50 లక్షలు ఉండటం వల్ల చాలా మందికి దీనిని కొనడం కొంచెం కష్టమవుతుంది. కానీ ఇప్పుడు మీకు శుభవార్త ఉంది! ఈ స్టైలిష్ బైక్‌ను కంపెనీ కేవలం రూ. 8,000 డౌన్ పేమెంట్‌తో అందుబాటులోకి తెస్తోంది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 కొనడానికి, మీరు కేవలం రూ. 8,000 డౌన్ పేమెంట్ చెల్లించాలి. మిగిలిన మొత్తానికి మీరు బ్యాంకు నుండి రుణం తీసుకోవచ్చు. ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రెట్రో ఫ్యాక్టరీ బేస్ మోడల్ ఆన్-రోడ్ ధర రూ. 1.73 లక్షలు. అంటే, రూ. 8,000 డౌన్ పేమెంట్ తర్వాత, మీరు రూ. 1.64 లక్షల రుణం తీసుకోవలసి ఉంటుంది. మీరు 9% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 8,100 EMI చెల్లించాలి. 3 సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే, ఈ EMI రూ. 5,800కి తగ్గుతుంది మరియు 4 సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే, అది రూ. 4,700 అవుతుంది.
ఇంజిన్, పవర్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350లో 349 సిసి సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజన్ ఉంది, ఇది 20.2 బిహెచ్పి పవర్ , 27 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ కూడా ఉంది. ఈ బైక్‌లో 13 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. దీని మైలేజ్ లీటర్‌కు 36.2 కి.మీ.
ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్, తమ పాపులర్ మోడల్ అయిన హంటర్ 350లో అప్డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ముంబై, ఢిల్లీలలో నిర్వహించిన ‘హంటర్‌హుడ్’ ఫెస్టివల్ వేదికగా 2025 మోడల్ హంటర్ 350 బైక్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ ఆకర్షణీయమైన కొత్త రంగులతో పాటు పలు కీలకమైన ఫీచర్ అప్గ్రేడ్లతో వస్తోంది.
2025 హంటర్ 350 బైక్ ఇప్పుడు మూడు సరికొత్త రంగుల్లో లభ్యమవుతుంది: రియో వైట్, టోక్యో బ్లాక్, లండన్ రెడ్. పాత మోడల్‌తో పోలిస్తే ఇందులో అనేక మార్పులు చేశారు. ముఖ్యంగా, మెరుగైన రైడింగ్ అనుభూతి కోసం ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్, టైప్-సి USB ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం అందించారు. అలాగే, గ్రౌండ్ క్లియరెన్స్‌ను 10mm పెంచారు, వెనుక సస్పెన్షన్‌ను మెరుగుపరిచారు, సీట్ కంఫర్ట్‌ను కూడా పెంచినట్లు కంపెనీ తెలిపింది. రాయల్ ఎన్ఫీల్డ్ 350cc శ్రేణిలో స్లిప్పర్-అసిస్ట్ క్లచ్ కలిగి ఉన్న మొదటి బైక్ ఇదే కావడం విశేషం.