RRB Section Controller Recruitment 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) సెక్షన్ కంట్రోలర్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు.

RRB Section Controller Recruitment 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) సెక్షన్ కంట్రోలర్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు. రైల్వే శాఖలో ఉద్యోగం అనేది ఎంతో మందికి కలల ఉద్యోగం. తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ట్రాఫిక్ విభాగంలో Section Controller పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 368 ఖాళీలు ఉన్నాయని స్పష్టం చేశారు. గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

పోస్టుల విభజన – జోన్ వారీగా ఖాళీలు:

ప్రస్తుతం రైల్వే బోర్డు అన్ని జోన్‌ల నుండి Indent Management System ద్వారా ఖాళీల సమాచారం సేకరిస్తోంది. త్వరలో జోన్ వారీగా ఖాళీల విభజన కూడా అధికారికంగా విడుదల అవుతుంది.

అర్హత వివరాలు:

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అభ్యర్థులు కనీసం గ్రాడ్యుయేషన్ (Degree) పూర్తి చేసి ఉండాలి. ఏ స్ట్రీమ్ అయినా సరే, గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైతే చాలు.

దరఖాస్తు తేదీలు:

ప్రస్తుతం జోన్‌లతో ఇన్‌డెంట్ ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు ప్రారంభం మరియు ముగింపు తేదీలు త్వరలో RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తారు. మీరు రెగ్యులర్‌గా వెబ్‌సైట్‌ను లేదా ఈ పేజీని చెక్ చేస్తూ ఉండండి.

జీతభత్యాలు:

సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు అటాచ్ఛైన పే స్కేల్ ప్రస్తుతానికి RRB CEN ద్వారా ప్రకటించాల్సి ఉంది. అయితే సాధారణంగా ఈ పోస్టులకు లెవల్-6 లేదా లెవల్-7 పే స్కేల్ ఉండే అవకాశం ఉంది. మొదట్లోనే ₹65,000/- పైగా జీతం వచ్చే అవకాశం ఉంది.

అధికారిక వెబ్ సైట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment