Bajaj Platina Launch New Bike : అదిరిపోయే లుతో బజాజ్ ప్లాటినా 125cc న్యూ బైక్ లాంచ్.అత్యధిక ఫీచర్స్‌తో మార్కెట్లోకి బజాజ్ ప్లాటినా 125 కొత్త మోడల్ 2025 అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.
ప్రముఖ బజాజ్ కంపెనీ మార్కెట్లోకి తమ మరో కొత్త బైక్‌ను విడుదల చేయబోతోంది. ఇప్పటికే ఈ బైక్‌కి సంబంధించిన ఫీచర్స్, ఇతర వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ బైక్ ఏంటని అనుకుంటున్నారా? అదేంటో కాదు.. ప్లాటినా 125 కొత్త సిరీస్.. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్‌తో అందుబాటులోకి వస్తోంది.
బజాజ్ ప్లాటినా (Bajaj Platina) పేరు వినగానే మనసులోకి వచ్చే మొదటి విషయం తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్. 2006లో తొలిసారిగా మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ బైక్, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా తన స్థానాన్ని నిలబెట్టుకోవడం చిన్న విషయం కాదు. మారుతున్న ట్రెండ్స్, పెరుగుతున్న పోటీ మధ్య ప్లాటినా ఎందుకు తనదైన క్రేజ్‌ను కొనసాగించగలుగుతోంది అంటే, దాని వెనుక ఉన్న ప్రధాన కారణం సింప్లిసిటీ విత్ యూజ్‌ఫుల్ ఫీచర్స్. ప్రతి రోజు ఉద్యోగానికి వెళ్లే వారైనా, కాలేజీకి వెళ్లే స్టూడెంట్ అయినా, లేదా చిన్న వ్యాపారం చూసుకునే వ్యక్తి అయినా… ప్లాటినా అందరికీ సరిపోయే ఒక ఆప్షన్‌గా మారింది. తక్కువ ధరలో దొరకడం, పెట్రోల్ ధరలు ఎంత పెరిగినా భారం కాకుండా 70 నుండి 90 కి.మీ. పైగా మైలేజ్ ఇవ్వగలగడం దీని నిజమైన బలం.
డిజైన్ పరంగా ప్లాటినా చాలా సింపుల్‌గా ఉంటుంది, కానీ అదే సింప్లిసిటీ రైడింగ్‌లో కంఫర్ట్‌ని ఇస్తుంది. పొడవాటి సీటు, సాఫ్ట్ సస్పెన్షన్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ కలిపి ఇది ఒక జనాలు మెచ్చిన బైక్ అనే పేరుకు తగినట్టే నిలుస్తాయి. ప్రస్తుతం ఇది రెండు వేరియంట్లలో లభిస్తోంది. ప్లాటినా 100 ధర రూ.70,643 వద్ద అందుబాటులో ఉంటే, మరింత శక్తివంతమైన ప్లాటినా 110 మాత్రం రూ.74,694(ఎక్స్-షోరూమ్) ధరలో దొరుకుతుంది.