vivo Y 500 Launched: వివో నుంచి 8200 mAh బ్యాటరీతో వాటర్ ప్రూఫ్ మొబైల్ మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.వివో తన సరికొత్త ఫోన్ Vivo Y500 ను చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్ 8,200mAh బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది 6.77-అంగుళాల 120Hz AMOLED డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 50MP ప్రధాన కెమెరాతో వస్తుంది.
వివో (Vivo) కంపెనీ నుంచి చైనా (China) మార్కెట్లో ఒక భారీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. అదే వివో Y500 5G (Vivo Y500 5G). ఇప్పుడు టెక్ సెక్టార్ ఫోకస్ దీనిపైనే ఉంది. ఎందుకంటే, ఈ డివైజ్‌లో ఒక కిల్లర్ ఫీచర్ ఉంది.. అదే దీని లార్జెస్ట్ బ్యాటరీ. ఏకంగా 8,200mAh కెపాసిటీతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్, వివో చరిత్రలోనే ఒక కొత్త రికార్డు సృష్టించబోతోంది. ప్రస్తుతం మనం వాడుతున్న హెవీ యాప్స్, ఫాస్ట్ ప్రాసెసర్ వల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే వివో ఈ Y500 ఫోన్‌ను తీసుకొస్తోంది.
బ్యాటరీలో సరికొత్త బెంచ్‌మార్క్:
Y500 5G ఫోన్లో ఏకంగా 8,200mAh బ్యాటరీ ఉంటుంది. గతేడాది వచ్చిన వివో Y300 (Vivo Y300) 6,500mAh బ్యాటరీతో పోలిస్తే ఇది చాలా పెద్ద జంప్. తమ ఫోన్లలో ఇదే అత్యంత లాంగెస్ట్ లాస్టింగ్ బ్యాటరీ అని కంపెనీ గర్వంగా చెబుతోంది. దీన్నిబట్టి చూస్తే, భవిష్యత్తులో ఫోన్లలో కూడా ట్యాబ్లెట్ సైజ్ బ్యాటరీలు ట్రెండ్‌గా మారొచ్చని తెలుస్తోంది.
లాంచ్ డేట్ ఫిక్స్:
వివో Y500 ఫోన్‌ను సెప్టెంబర్ 1న చైనాలో లాంచ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ చాలా స్ట్రాంగ్. దీనికి IP68, IP69, IP69+ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ ఉన్నాయి. వివో ఫోన్లలో ఇంత పవర్ఫుల్ వాటర్ రెసిస్టెన్స్ ఉన్న ఫోన్ ఇదే. అంతేకాదు, SGS గోల్డ్ లేబుల్ 5-స్టార్ డ్రాప్ టెస్టులు, మిలిటరీ-స్టాండర్డ్ టెస్టులను కూడా ఇది ఈజీగా పాసైంది. ఎలాంటి టఫ్ కండిషన్స్నైనా తట్టుకునేలా దీన్ని డిజైన్ చేశారు.
వివో Y500 ధర:
Vivo Y500 మొబైల్ 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 17,000గా కంపెనీ నిర్ణయించింది. అలాగే 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 19,700 గా ఉంది. అదే సమయంలో ఈ Vivo Y500 హ్యాండ్సెట్ 12GB ర్యామ్+ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,000గా ఉంది. దీని టాప్ మోస్ట్ వేరియంట్ 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,700 గా కంపెనీ నిర్ణయించింది.
వివో Y500 స్పేస్:
Vivo Y500 స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది డ్యూయల్ సిమ్ (నానో + నానో)తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆరిజిన్ OS 15 పై నడుస్తుంది. Vivo Y500 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR సపోర్ట్‌తో 6.77-అంగుళాల ఫుల్ HD+ (2,392 x 1,080 పిక్సెల్స్) AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది.