BSF Jobs: బీఎస్ఎఫ్ 1,121 హెడ్ కానిస్టేబుల్ జాబ్స్ ఆర్ ఓ అండ్ ఆర్ఎం పోస్టులు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) 1,121 హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్): 910 పోస్టులు, హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్): 211 పోస్టులు.
అర్హత ప్రమాణాలు:
హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్): అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ కోర్ సబ్జెక్టులుగా 12వ తరగతి లేదా రేడియో, ఎలక్ట్రానిక్స్ లేదా సంబంధిత రంగాలలో ITI సర్టిఫికెట్తో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్): అభ్యర్థులు ITI అర్హతతో 10వ తరగతి లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్తో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 24న ప్రారంభమై సెప్టెంబర్ 23న ముగుస్తుంది.
మరిన్ని వివరాలకు క్రింద లింక్ క్లిక్ చెయ్యండి