Maruti Suzuki Baleno:-దేశంలో ఆటోమొబైల్ రంగం ప్రస్తుతం అమ్మకాలు పెంచుకునేందుకు పలు రకాల ఆఫర్లను అందిస్తోంది. ఈ క్రమంలో మారుతి సుజుకీ ఇండియా తమ ప్రీమియం హాచ్‌బ్యాక్ బాలెనో కారుపై జూలై నెలలో భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది.
బాలెనో పెట్రోల్ మరియు సీఎన్‌జీ వేరియంట్లపై కంపెనీ రూ. 1.10 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. ఇందులో రూ. 45,000 నగదు తగ్గింపు, మిగతా మొత్తం లోన్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ ల రూపంలో అందుబాటులో ఉంటుంది.
ప్రస్తుతం బాలెనో కారుకు ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.70 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఈ తగ్గింపుతో కస్టమర్లు పెద్ద మొత్తంలో లాభపడే అవకాశం ఉంది.
గమనిక: ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు తమ దగ్గరలోని నెక్సా డీలర్ షిప్ ను సంప్రదించాలి.