Telengana Statet Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే!

Telengana Statet Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే!

Telengana Statet Cabinet Decisions : తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయనున్నట్లు ప్రకటించింది.

Telengana Statet Cabinet Decisions : తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంలో చేయాలని నిర్ణయించింది. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సుదీర్ఘంగా కొనసాగిన మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో టీఎస్ఆర్టీసీ విలీనం బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేబినెట్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించిన విధివిధానాలు, నిబంధనలు రూపొందించేందుకు ఓ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి కేటీఆర్ కేబినెట్ నిర్ణయాలు మీడియాకు వెల్లడించారు.

మెట్రో విస్తరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

వచ్చే మూడు, నాలుగేళ్లలో హైదరాబాద్‌ మెట్రో వ్యవస్థను విస్తరించేందుకు కేబినెట్‌నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాయదుర్గం- శంషాబాద్ ఎయిర్ పోర్టు మధ్య మెట్రో రైలు విస్తరణ టెండర్‌ ప్రక్రియ జరుగుతోందన్నారు. మియాపూర్‌ నుంచి మియాపూర్ వరకు మెట్రో విస్తరణకు మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. మియాపుర్‌ నుంచి లక్డీకపూల్‌ వరకు, ఎల్బీనగర్‌ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు, ఉప్పల్‌ నుంచి బీబీ నగర్‌, ఈసీఐఎల్‌ వరకు మెట్రో విస్తరణకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. అదే విధంగా కొత్తూరు-షాద్‌నగర్‌ వరకు మెట్రో రైలు విస్తరణ చేపడతామన్నారు. జేబీఎస్‌ నుంచి తూంకుంట, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు డబుల్‌ డెక్కర్‌ మెట్రో నిర్మాణం చేపడతామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *