Thalaivar 170: రజినీకాంత్ తో సినిమా లో నాచురల్ స్టార్ నాని నటించ బోతున్నాడా…..
Thalaivar 170: స్టార్ హీరో రజినీకాంత్ నెక్స్ట్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా వర్కింగ్ టైటిల్ ‘తలైవర్ 170’గా ఉంది.
Thalaivar 170: తమిళ సూపర్ స్టార్, సీనియర్ హీరో రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా విడుదలకు రెడీ అయింది. ఆగస్టు 10వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. జైలర్ ట్రైలర్ అదిరిపోవటంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇది ఇలా ఉండగా రజినీకాంత్ వెంటనే తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఈ చిత్రం రజినీ కాంత్ 170వ సినిమా కావటంతో వర్కింగ్ టైటిల్ ‘తలైవర్ 170’గా ఉంది. జైభీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
మరోవైపు, టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. రజినీకాంత్ సినిమాలో నటిస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర బృందం నానితో చర్చలు జరిపిందని సమాచారం. తలైవర్ 170లో నాని క్యామియో రోల్ ఉంటుందని టాక్ నడుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ విషయంపై స్పష్టత రానుంది. మరోవైపు, బాలీవుడ్ సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక, 72 సంవత్సరాల వయసులోనూ రజినీకాంత్ ఫుల్ బిజీగా ఉంటున్నారు. జైలర్ చిత్రం విడుదలకు రెడీ అయింది. అలాగే, తన కూతురు దర్శకత్వం వహించిన లాల్ సలామ్ చిత్రంలో రజినీ కీలక పాత్ర చేశారు. విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మొయిద్దీన్ భాయ్ పాత్ర పోషించారు రజినీ. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి
అయింది.