Telengana TET 2023 notification released: తెలంగాణ టెట్ 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది…..

Telengana TET 2023 notification released: తెలంగాణ టెట్ 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది…..

Telengana state  TET 2023 : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. రేపటి(ఆగస్టు 2) నుంచి ఈనెల 16 వరకు ఆన్‌లైన్‌ లో అప్లికేషన్లు స్వీకరించనున్నారు.

TS TET 2023 : తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. మంగళవారం టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రేపటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు టెట్ అప్లికేషన్లు స్వీకరిస్తారు. సెప్టెంబర్‌ 15న టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2 రాత పరీక్షలు నిర్వహిచనున్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో టెట్ నిర్వహణపై మంత్రి వర్గ సబ్ కమిటీ  నిర్ణయం తీసుకుంది.

పేపర్‌-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించారు. బీఈడీ అభ్యర్థులు పేపర్‌-2తోపాటు పేపర్‌-1 పరీక్ష కూడా రాసుకునే అవకాశం కల్పించింది. ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్‌ నిర్వహణపై రూపొందించిన ప్రతిపాదనలు విద్యాశాఖ ఆమోదించింది. ఈ మేరకు మంగళవారం టెట్‌ నోటిఫికేషన్ రిలీజ్‌ చేశారు. సెప్టెంబర్ 15న నిర్వహించే టెట్ పేపర్ 1 పరీక్షనను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్ -2 ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు ప్రకటించనున్నారు. అభ్యర్థులు టెట్ వెబ్‌సైట్‌ https://tstet.cgg.gov.in …పరీక్ష ఫీజు రూ. 400 చెల్లించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:
ఆగస్టు 2- ఆన్ లైన్ లో అప్లికేషన్లు ప్రారంభం
ఆగస్టు 16- అప్లికేషన్ల స్వీకరణకు చివరి తేదీ
సెప్టెంబర్ 15 – టెట్ రాతపరీక్ష
TS TET 2023కి ఇలా దరఖాస్తు చేసుకోండి
Step 1 : టెట్ అధికారి వెబ్ సైట్ tstet.cgg.gov.in ను సందర్శించండి.

Step 2: హోమ్‌పేజీలో TS TET 2023 నోటిఫికేషన్ లింక్ పై చూడండి.

Step 3: PDF ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇందులో అన్ని వివరాలను పూర్తిగా తనిఖీ చేయండి.

Step 4: అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేసి అభ్యర్థి వివరాలు నమోదు చేసి, ఫీజు చెల్లించాలి. అనంతరం సబ్మిట్ చేసి అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *