Spy in OTT: సర్‌ప్రైజ్.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన స్పై మూవీ

Spy in OTT: సర్‌ప్రైజ్.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన స్పై మూవీ

Spy in OTT: ఇది నిజంగా ఆశ్చర్యమే. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది స్పై మూవీ. నిఖిల్ సిద్ధార్థ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో నెల రోజుల్లోపే సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చారు.

Spy in OTT: కార్తికేయ 2 మూవీతో తర్వాత నిఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న స్పై మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. సినిమాకు తొలి రోజు నుంచే నెగటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. దీంతో ఈ సినిమా నెల రోజుల్లోపే స్పై మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అసలు ముందుగా ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా స్పై మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులోకి వచ్చింది.

గురువారం (జులై 27) ఉదయం ప్రైమ్ వీడియోలో  స్పై మూవీ ఉండటం చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. జూన్ 29న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. నెల రోజుల్లోపే ఓటీటీ లోకి వచ్చేసింది. గ్యారీ బీహెచ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నా.. వాటిని ఏమాత్రం అందుకోలేకపోయింది. పాన్ ఇండియా లెవల్లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది.

 

స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక మిస్టరీ గురించి ఈ మూవీలో చూపించబోతున్నారని చెప్పడంతో ముందు నుంచే స్పై మూవీపై అంచనాలు పెరిగాయి. టీజర్, ట్రైలర్ తో ఈ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే సినిమాలో మాత్రం ఊహించినంత సరుకు లేదు. ఇప్పుడు స్పై మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

 

స్పై రిజ‌ల్ట్ విష‌యంలో టాలీవుడ్ యంగ్ హీరో  నిఖిల్  అభిమానుల‌ను క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. భ‌విష్య‌త్తులో క్వాలిటీ విష‌యంలో అస‌లు కాంప్ర‌మైజ్ కాన‌ని మాటిచ్చాడు. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో స‌రైన రీతిలో ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డంలో విఫ‌ల‌మ‌య్యామ‌ని నిఖిల్ చెప్పాడు. అలాగేఓవ‌ర్‌సీస్‌లో 350కిపైగా తెలుగు ప్రీమియ‌ర్ షోస్ కూడా ర‌ద్దు కావ‌డం బాధ‌ను క‌లిగించింద‌ని నిఖిల్ చెప్పాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *