Samsung Galaxy F34 5G: శామ్సంగ్ ఇంకో కొత్త మోడల్ గెలాక్సీ ఎఫ్34 ను ఇండియా లో లాంచ్ చేసింది!
Samsung Galaxy F34 5G: శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ఇండియాకి వచ్చేసింది. ఈ మోడల్ వివరాలు తెలుసుకుందాము..
ముఖ్యాంశాలు:
ఇందులో 6.46 ఇంచ్ 120 హెచ్‌జెడ్‌తో కూడిన అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. సెంటర్ అలైన్డ్ వాటర్‌డ్రాప్ నాచ్.. టాప్‌లో ఉంది. 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో కెమెరాలు రేర్‌లో వస్తున్నాయి. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ శామ్సంగ్ గెలాగ్సీ ఎఫ్34 5జీలో 13ఎంపీ ఫ్రెంట్ కెమెరా లభిస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌కు కార్నరింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ వస్తోంది. ఆక్టా కోర్ ఎక్సినోస్ 1289 ఎస్ఓసీ చిప్సెట్ దీని సొంతం. 8జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరింట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ 5.1 సాఫ్ట్‌వేర్‌తో ఇది పనిచేస్తుంది.
ఈ శామ్సంగ్ గెలాగ్సీ ఎఫ్34 5జీలో 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం విశేషం. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వస్తోంది. 5జీ, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, వైఫై, బ్లూటూక్ వీ5.3, యూఎస్బీ టైప్-సీ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఉంటాయి.
ఎలక్ట్రిక్ బ్లాక్, మిస్టిక్ గ్రీన్ కలర్స్‌లో ఈ మోడల్ అందుబాటులో ఉండనుంది.
శామ్సంగ్ గెలాగ్సీ ఎఫ్34 5జీ 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999గా ఉంది. 8జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999గా ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్స్ మొదలయ్యాయి. ఈ నెల 12న డెలివరీలు మొదలవుతాయని సమాచారం.
అంతేకాకుండా.. ఈ గ్యాడ్జెట్‌పై ఐసీఐసీ బ్యాంక్ క్రెడిట్ కార్డు మీద రూ.2,111 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. కొటాక్ బ్యాంక్ కార్డులపై రూ.1000 వరకు తగ్గింపు వస్తోంది.