Nepal Cricket Team players : నేపాల్ ఆసియ కప్ 2023 ఆడనుందా…?

Nepal Cricket Team players : నేపాల్ రాబోయే ఆసియా కప్ 2023 కోసం తన 17 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. జట్టు కమాండ్‌ని 20 ఏళ్ల ఆల్‌రౌండర్‌ రోహిత్‌ పాడెల్‌కు అప్పగించారు. ఆసియా కప్ ఒన్డే ఫార్మాట్‌లో ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 17 వరకు జరగనుంది, ఇందులో 6 జట్లు పాల్గొంటాయి.

నేపాల్ క్రికెట్ అసోసియేషన్ (CAN) తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో టోర్నమెంట్ కోసం జట్టును ప్రకటించింది. పాకిస్తాన్‌లో వారం రోజుల పాటు జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా జట్టు పాల్గొంటుందని, అందులో పాక్ జట్లతో మ్యాచ్‌లు ఆడుతుందని CAN తెలిపింది. భారత్‌, పాకిస్థాన్‌లతో పాటు నేపాల్‌ గ్రూప్‌-ఎలో చోటు దక్కించుకుంది.

సెప్టెంబర్ 4న నేపాల్ టీమ్ ఇండియాతో తలపడనుంది
నేపాల్ జట్టు ఆసియా కప్‌లో ఆగస్టు 30న ముల్తాన్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. దీని తర్వాత సెప్టెంబర్ 4న శ్రీలంకలోని క్యాండీలో భారత్‌తో తలపడనుంది. భారత్‌, పాకిస్థాన్‌లతో పాటు నేపాల్‌ గ్రూప్‌-ఎలో చోటు దక్కించుకుంది.

ఆసియా కప్ 2023 కోసం నేపాల్ జట్టు
రోహిత్ పౌడెల్ (c), కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్ (wk), భీమ్ షార్కీ, కుశాల్ మాలా, ఆరిఫ్ షేక్, దీపేందర్ సింగ్ ఐరీ, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, కరణ్ KC, సందీప్ లామిచానే, లలిత్ రాజ్‌బన్షి, ప్రతిష్ GC, శ్యామ్ ధాకల్, సందీప్ జోరా, కిషోర్ మహ్తో మరియు అర్జున్ సౌద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *