Must try fish (pulasa or hilsa); వర్షా కలం లో తప్పకుండా ట్రై చేయాల్సిన చేప… రేట్ తెలిస్తే బాబోయ్ అనాల్సిందే…

Must try fish (pulasa or hilsa); వర్షా కలం లో తప్పకుండా ట్రై చేయాల్సిన చేప రేట్ తెలిస్తే బాబోయ్ అనాల్సిందే…

వర్షా కాలం వచ్చేసింది తొలకరి చినుకుల సందడి మొదలైంది అలాగే గోదావరి జిల్లాలో పులస చేపల సందడి మొదలవుతుంది. ఇది ముఖ్యం గా గోదావరి నది లో వరదలు మొదలు అయ్యాక దొరుకుతుంది. దీనికి ఎందుకు ఇంత క్రేజ్ ఉందొ తెలుసుకుందాం .

పులస శాస్త్రీయ నామం హిల్సా హిల్సా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సముద్ర జలాల్లో సంచరించే ఈ చేప సంతాన ఉత్పత్తి సమయంలో గుడ్లు పెట్టడానికి ఉభయ గోదావరి జిల్లాల సముద్ర జలాల్లోకి వస్తుంది. ఆషాడ శ్రావణమాసంలో ఇక్కడ గుడ్లు పెట్టి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది నదిలోకి వచ్చి రెండు మూడు రోజుల్లోనే పులుసుగా మారుతుంది.

పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం తూర్పుగోదావరి జిల్లా సమీపంలోని యానం వద్ద పులుసులు విరివిగా దొరుకుతాయి. ఈ చేప ఇతర ప్రాంతాలలో దొరికిన గోదావరి జిల్లాలో దొరికినంత పులసంతా రుచి వాటికి ఉండదని మస్తకారులతో పాటు ఆహార ప్రియులు చెబుతుంటారు.
“పుస్తెలు అమ్ముకునేనా సరే పులస తినాలి” అనేది గోదావరి జిల్లాలో నానుడి ఆ చేప అంటే వారికి ఎంత ఇష్టమో ఆ నానుడు వింటేనే తెలుస్తుంది. సంవత్సరానికి కేవలం రెండు నెలలు మాత్రమే లభించే అరుదైన పులుసు చేప అంటే గోదావరి జిల్లా ప్రజలతో పాటు అనేక ప్రాంతాల ప్రజలు పడి చచ్చిపోతుంటారు. చేపలందు పులుసు చేప వేరు దీని రుచికి లొట్టలు వేసుకుంటూ ఆరగించేస్తారు. తాజాగా అనేక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద పోటు పెరిగింది. దీంతో పులస చేపలు హాయ్ అంటూ గోదారాలను పలకరిస్తున్నాయి.

యానం తీరంలో రెండు మూడు రోజులుగా పులుసు చేపలు వలలో పడుతున్నాయి దీంతో మత్సకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉండే కేంద్ర పాలిత ప్రాంతం యానంలోని శివం పుష్కర ఘాటు వద్ద ఆదివారం మస్తకారులు పులుసు చేపల అమ్మకానికి పెట్టారు. చాలా తక్కువ సంఖ్యలో ఉన్న వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు. వాటి సైజును బట్టి 1400 నుంచి 6000 కు ధర పెట్టి కొనుక్కున్నారు.

పులస చేపలు ఎక్కువగా భైరవపాలెం సమీపంలోని సముద్రం మగవద్ద లభ్యం అవుతున్నాయి దీంతో మస్యకారులను నాటు పడవలపై అక్కడికి చేరుకొని పులుసుల కోసం వేట సాగిస్తున్నారు. సోమవారం కిలో బరువు ఉన్న చేపలను ఓ వ్యక్తి 6000కు కొనుగోలు చేశాడు. కేవలం వరద సీజన్లో మాత్రమే దొరికే పులస చేప ధర చాలా ఎక్కువగా ఉంటుందని. రాబోయే రోజుల్లో కిలో చేపదర 8000 కూడా చేరుతుందని మస్త్యకారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *