Monsoon Precautions: వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే!!

Monsoon Precautions: వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే!!

వర్షాకాలం మండుతున్న వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది, అయితే ఇది దాని స్వంత సవాళ్లతో కూడా వస్తుంది. వరదల నుండి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వరకు, సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉంటూనే వర్షాకాలాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ బ్లాగ్‌లో, వర్షాకాలంలో అనుసరించాల్సిన ప్రధాన జాగ్రత్తలను మేము విశ్లేషిస్తాము.

డెంగ్యూ చికెన్ గునియా మలేరియా కలరా టైఫాయిడ్ డయేరియా వైరల్ ఫీవర్ వంటి ఎన్నో వ్యాధులు వర్షాకాలంలోనే ఎక్కువగా ప్రభలుతుంటాయి. వీటితోపాటు జలుబు దగ్గు జ్వరం వంటి సాధారణ సమస్యలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి వీటిని నివారించేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. వర్షాకాలంలో గాలిలో అధిక తేమ వల్ల హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఎక్కువ ఇది మన రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపి వివిధ రకాల వ్యాధుల బారిన పడేలా చేస్తుంది.అందుకే ఈ కాలంలో ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ వహించాలంటున్నారు. నిపుణులు వాతావరణంలోని మార్పుల వల్ల జలుబు దగ్గు వంటి సీజనల్ సమస్యలు తలెత్తటం సహజం సమస్యలు ఉన్నవారిలో ఇది మరింత ప్రతికూల ప్రభావం చూపుతాయి.

ఒక్కోసారి ఇంట్లో ఉండే కంటికి కనిపించని క్రిమి కీటకాలు కూడా ఇలాంటి సీజనల్ ఆలోచనలకు కారణం అవుతుంటాయి కాబట్టి వీటి బారిన పడకుండా ఉండేందుకు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే డాక్టర్ సలహా మేరకు ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవడం కూడా మంచిది. రోగనిరోధక శక్తిని పెంచే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు పెరుగు ఆకుకూరలు మొదలైనవి తీసుకోవడం ఆవిరి పట్టడం వంటివి క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఇలాంటి సీజనల్ అలర్జీలకు దూరంగా ఉండవచ్చు. వర్షాకాలం అనగానే అందరికీ సడన్గా గుర్తు వచ్చేవి జలుబు దగ్గు జ్వరం.

చిన్నపిల్లల్లో గనుక చూసుకుంటే ఈ వైరల్ ఫీవర్స్ ఫ్రెండ్ వల్ల స్కూల్ కి వెళ్తుంటారు కదండీ స్కూల్ కి వెళ్ళగానే ఒకరి నుండి మరొకరికి వెంట వెంటనే ఫీవర్ రావడము ఇవన్నీ కూడా నోటీస్ చేస్తుంటాం. పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి పౌష్టికాహారం చాలా ఇంపార్టెంట్ పిల్లలు అనే కాదు పెద్దవాళ్ళు కూడా పౌష్టికాహారం తీసుకోవాలి. డైలీ ఎక్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అలాగే పెద్దవాళ్లు ఈ వర్షాకాలంలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది .చాలామందిలో బీపీ షుగర్ ఇలాంటివి కూడా ఉంటాయి వాళ్లు కూడా వర్షంలో తడవడం ద్వారా తొందరగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఆలస్యం చేస్తే ఇప్పుడు జలుబు దగ్గులా ఉన్నది నిమోనియా వరకు కూడా దారి తీయవచ్చు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *