Miss Shetty Mr Polishetty: మూవీ రిలీజ్ డేట్ ఫై క్లారిటీ వచ్చిందా…
Miss Shetty Mr Polishetty: అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి రిలీజ్ డేట్‌పై సస్పెన్స్ ఇంకా వీడలేదు. ఆగస్ట్‌లో ఈ సినిమా రిలీజ్ అవుతోందా? లేదా? అన్నది టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Miss Shetty Mr Polishetty:అనుష్క (Anushka) మరియు నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి రిలీజ్ కష్టాలు పడతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఇంకా క్లారిటీ రానట్లు సమాచారం. ఆగస్ట్ 18 లేదా 25లలో ఒక డేట్‌ను ఫిక్స్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు డేట్‌లలో ఏది ఫిక్స్ కాకపోతే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది డైలామాలో పడే అవకాశం ఉందని అంటున్నారు.
సెప్టెంబర్‌లో సలార్(Salaar), స్కంద, ఖుషితో(Kushi) పాటు పలు భారీ బడ్జెట్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. వాటికి పోటీగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిని రిలీజ్ చేయడం రిస్క్ అనే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం. వాటి కంటే ముందుగానే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిని రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మరో రెండు, మూడు రోజుల్లో మూవీ రిలీజ్ డేట్‌ఫై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తొలుత ఈ సినిమాను ఆగస్ట్ 4న రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యం కావడంతో సినిమా విడుదలను వాయిదావేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రెండుమూడు సార్లు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసి ఆ తర్వాత పోస్ట్‌పోన్ చేశారు.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో అనుష్క, నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. పి మహేష్‌బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో సందీప్ కిషన్‌తో రా రా కృష్ణయ్య అనే సినిమాను తెరకెక్కించాడు మహేష్‌బాబు. సుదీర్ఘ విరామం తర్వాత ఈ సినిమాతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఇందులో చెఫ్ పాత్రలో అనుష్క శెట్టి కనిపించబోతుండగా, స్టాండప్ కమెడియన్‌గా నవీన్ పొలిశెట్టి నటిస్తున్నాడు. నిశ్శబ్ధం సినిమా తర్వాత మూడేళ్ల విరామం అనంతరం అనుష్క హీరోయిన్‌గా నటిస్తోన్న మూవీ ఇది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.