అతనిని ప్రశంసలతో ముంచెత్తిన విరాట్ కోహ్లీ…

వన్డే ప్రపంచకప్ 2023లో అప్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. గ్లెన్ మ్యాక్స్ వెల్ అద్భుతం, సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు సైతం ఇదే తరహా పోస్టులు చేస్తున్నారు. తాజాగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ.. స్పందించాడు. ఐపీఎల్‌లో తన తోటి ఆటగాడిఫై ప్రశంసల జల్లు కురిపించాడు.

మంగళవారం వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో విధ్వంసం సృష్టించాడు. జట్టు ఓడిపోయే దశ నుంచి సంచలన ప్రదర్శనతో విజయతీరాలకు చేర్చాడు.

292 పరుగుల లక్ష్య ఛేదనలో 92 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశ నుంచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మరో ఎండ్‌లో ప్యాట్ కమిన్స్ వంటి టెయిలెండర్ సహకారంతో జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. చివరకు 201 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఓ దశలో నిల్చోడానికి కూడా ఇబ్బంది పడ్డ మ్యాక్సీ.. మొండిగా బ్యాటింగ్ చేశాడు. క్రీజులో నిలబడి అమాంతం బంతిని స్టాండ్స్‌లోకి పంపించాడు. డబుల్ సెంచరీ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

మ్యాక్స్‌వెల్ సంచలన ఇన్నింగ్స్‌పై క్రీడా ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. తన బ్యాటింగ్ మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా చేరిపోయాడు. మ్యాక్సీ బ్యాటింగ్‌పై ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.

“ఇటువంటి అద్భుతాలు నీవు మాత్రమే చేయగలవు మ్యాక్సీ” అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో రాసుకొచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *