IT Refund: ఖాతాల్లో డబ్బులు జమ చేసిన కేంద్రం..మరి మీరు చెక్ చేసుకున్నారా..

IT Refund: ఖాతాల్లో డబ్బులు జమ చేసిన కేంద్రం..మరి మీరు చెక్ చేసుకున్నారా..

ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు జులై 31తో గడువు ముగుస్తుంది.

IT Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అందుకు గడువు మరో వారం రోజుల్లో ముగియనుంది. జులై 31లోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేకపోతే ఆ తర్వాత రూ. 5 వేల వరకు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఇంకా ఎవరైనా ఉంటే ఇప్పుడే ఆ పని పూర్తి చేయడం మంచింది. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు సమీపిస్తున్న క్రమంలో ఇప్పటి వరకు 4 కోట్ల మందికి పైగా ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ నితిన్ గుప్తా వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేయగా.. వేగంగా ప్రాసెస్ చేస్తున్నట్లు చెప్పారు సీబీడీటీ ఛైర్మన్ నితిన్ గుప్తా. ప్రాసెస్ పూర్తై అర్హులైన 80 లక్షల మందికి ఇప్పటికే రిఫండ్ అందించినట్లు చెప్పారు. 80 లక్షల మంది పన్ను చెల్లింపుదారుల ఖాతాల్లో వారి రిఫండ్ జమ చేసింది. ఇంకా ఎవరైనా రిఫండ్ రావాల్సిన వారు స్టేటస్ చెక్ చేసుకోవడం మంచిది.

వ్యక్తిగత, కార్పొరేట్ ప్రత్యక్ష పన్నులు కలిపి 2022- 23 ఆర్థిక ఏడాదిలో మొత్తం రూ. 16 లక్షల 51 వేల కోట్లు వసూలైనట్లు తెలుస్తుంది. 2021- 21 ఆర్థిక ఏడాదితో పోలిస్తే ఇది 17. 67 శాతం అధికం. సాధ్యమైనంత త్వరగా దాఖలైన రిటర్నులను ప్రాసెసి చేసి రిఫండ్ అందిస్తున్నారు.

దేశంలో ఆదాయపు పన్ను ప్రవేశపెట్టిన రోజు జులై 24ను ఇన్‌కమ్ ట్యాక్స్ డేగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించింది. పన్నుల కట్టాల్సిన ఆవశ్యకత, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే సీబీడీటీ ఛైర్మన్ నితిన్ గుప్తా కీలక విషయాలు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *