India getting ready for 6G: త్వరలో భారత్ 6G కి మారబోతుందా….?

India getting ready for 6G: భారత్  77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, ఎర్రకోట నుండి తన ప్రసంగంలో భారతదేశంలో 6G ప్లాన్ గురించి ప్రధాని మోదీ ప్రకటన చేశారు.

ఈరోజు దేశమంతటా స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై నుంచి ప్రసంగిస్తూ 6జీకి సంబంధించి పెద్ద ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో దేశంలో 6జీని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అత్యంత సరసమైన మొబైల్ డేటా ప్లాన్‌లు మరియు ఇంటర్నెట్ సేవలను అందిస్తోందని ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు.

టాస్క్‌ఫోర్స్ ఇప్పటికే అమల్లో ఉందని, భారతదేశం 5G నుండి 6Gకి వేగంగా మారడానికి కృషి చేస్తోందని కూడా ఆయన చెప్పారు. అలాగే మేము 6G టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని ప్రధాని చెప్పారు.

5G మరియు 6G మధ్య తేడాలు :
5G కంటే 6G లో ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ గా ఉంటుంది.
6G సెకనుకు 1 టెరాబిట్ వేగంతో కనెక్టివిటీ లో తక్కువ జాప్యాన్ని అందిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *