IBPS PO and Management Trainee  Notification 2023: నిరుద్యోగులకు శుభవార్త ఐబిపిఎస్‌ పిఓ, మేనేజ్మెంట్‌ ట్రైనీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది………

IBPS PO and Management Trainee  Notification 2023: నిరుద్యోగులకు శుభవార్త ఐబిపిఎస్‌ పిఓ, మేనేజ్మెంట్‌ ట్రైనీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది………

IBPS PO and Management Trainee  Notification: ఐబిపిఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్‌, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేష్‌ విడుదలైంది. ఆగష్టు 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం అవుతుంది. దేశ వ్యాప్తంగా పలు జాతీయ బ్యాంకుల్లో 3వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆగష్టు 21వ తేదీలోపు దరఖాస్తు ఛార్జీలను ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించడానికి ఆగష్టు 21 గడువు తేదీగా ప్రకటించారు.

మొత్తం 11 జాతీయ బ్యాంకులలో పిఓలు, మేనేజ్‌‌మెంట్‌ ట్రైనీల(IBPS PO and Management Trainee) నియామకం ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ నోటిఫికేషన్‌ విడుదలైంది. అన్ని బ్యాంకులలో కలిపి దాదాపు 3049 ఖాళీలను ప్రకటించారు. మరికొన్ని బ్యాంకులు ఖాళీలను వెల్లడించలేదు. ప్రొబేషనరీ ఆఫీసర్లను భర్తీ చేస్తున్న పలు బ్యాంకులు.

  1. బ్యాంక్‌ ఆఫ్ బరోడా
  2. బ్యాంక్ ఆఫ్ ఇండియా
  3. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
  4. కెనరా బ్యాంకు
  5. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  6. ఇండియన్ బ్యాంక్
  7. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు
  8. పంజాబ్ నేషనల్ బ్యాంకు
  9. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు
  10. యూకో బ్యాంకు
  11. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

వంటి బ్యాంకు లు ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

పిఓ, మేనేజ్మెంట్‌ ట్రైనింగ్‌ కోసం దరఖాస్తు చేసే వారి వయసు కనిష్టంగా 20ఏళ్ల నుంచి 30ఏళ్లకు మించకూడదు. ఎస్పీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్టంగా ఐదేళ్ల మినహాయింపు ఇస్తారు. బీసీలకు 3ఏళ్లు, వికలాంగులకు 10ఏళ్ల మినహాయింపు ఉంటుంది. మాజీ సైనికోద్యోగులకు ఐదేళ్ల మినహాయింపు ఇస్తారు.1993 ఆగష్టు 2 నుంచి 2003ఆగష్టు 1లోపు జన్మించిన వారు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు

ప్రీ ఎగ్జామినేషన్‌ ట్రైనింగ్‌ 20223 సెప్టెంబర్‌లో నిర్వహిస్తారు.ప్రిలిమినరీ పరీక్షల కోసం హాల్‌ టిక్కెట్లను సెప్టెంబర్‌లో విడుదల చేస్తారు. పిఓ, మేనేజ్మెంట్‌ ట్రైనీ నియామకాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను 2023 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహిస్తారు.

ముఖ్యమైన సమాచారం:
అక్టోబర్‌నెలలో ఫలితాలు వెల్లడిస్తారు. అక్టోబర్,నవంబర్‌ నెలల్లో మెయిన్స్ పరీక్షల తేదీలను ప్రకటిస్తారు. అభ్యర్థులకు హాల్ టిక్కెట్లను జారీ చేస్తారు. నవంబర్‌ నెలలో మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తారు. 2023 డిసెంబర్‌లో ఫలితాలను వెల్లడిస్తారు. 2024 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 2024 ఏప్రిల్‌ నెలలో ప్రొవిజినల్ అలాట్‌మెంట్‌ కేటాయిస్తారు. మరిన్ని వివరాలతో పాటు ఐబిపిఎస్ నోటిఫికేషన్ ఐబిపిఎస్‌ వెబ్‌సైట్‌ www.ibps.in అందుబాటులో ఉంది. నోటిఫికేషన్ కోసం లింక్ https://www.ibps.in/crp-po-mt-xiii/ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *