Eye Flu | తెలుగు రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్న కండ్లకలకలూ… ! లక్షణాలు, నివారణ మార్గాలు ఇవే..!

Eye Flu | తెలుగు రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్న కండ్లకలకలూ… ! లక్షణాలు, నివారణ మార్గాలు ఇవే..!

 

Eye Flu | తెలుగు రాష్ట్రాలు తో సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కండ్లకలకల (Eye Flu) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇది మరింత విస్తరించకుండా ప్రజలంతా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Eye Flu | తెలుగు రాష్ట్రాలు తో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కండ్లకలక (Eye Flu) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మరింత విస్తరించకుండా ప్రజలంతా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కండ్లకలకను పింక్‌ అని కూడా పిలుస్తుంటారు. కండ్లకలక ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంటుందని, రద్దీగా అధికంగా ఉండే ప్రదేశాలతో పాటు బస్సులు, మెట్రోల్లో ప్రయాణించే సమయంలో ఐ ఫ్లూ సోకే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. వాహనాల్లో వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

లక్షణాలు: ఇది బ్యాక్టీరియా ద్వారా సోకుతుందని, దాంతో కళ్లు ఎర్రబారడం, దురదగా ఉండడం, కళ్ల రెప్పల్లో వాపు, నీరుకారడంతో, ఫ్లూయిడ్ డిశ్చార్జ్ కావడం తదితర లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఒకసారి సోకితే తగ్గడానికి ఒకటి నుంచి రెండువారాల సమయం పడుతుంది. వయసుతూ సంబంధం లేకుండా ఏ వయస్సులోని వారికైనా ఈ ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉంటుందని, ఈ క్రమంలో అందరూ నివారణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది చిన్నపాటి ఇన్ఫెక్షన్‌గా అనిపించినా.. రోజువారీ జీవితాన్ని, పనులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఏ పని సైతం చేసుకోనివ్వకుండా చేస్తుంది. ఇది సాధారణంగా గాలి ద్వారా కోతుందని, వర్షాకాలంలో వాతావరణంలో మురికి, కాలుష్యం పెరగడంతో కండ్లకలక సోకుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

చిట్కాలు: అయితే, ఈ సమస్యకు మందులు వాడకపోయినా తగ్గిపోతుందని, ఇది ఇతరులకు వేగంగా వ్యాప్తిచెందే అవకాశం ఉన్నందున పలు జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. రద్దీగా ఉండే బస్సులు, మెట్రోలో ప్రయాణం చేసే సమయంలో ఎక్కువగా కండ్లకలక సోకే ప్రమాదం ఉంటుందని, ప్రయాణ సమయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బ్యాక్టరీయా అపరిశుభ్రంగా ఉన్న ఉపరితలాన్ని తాకవడం ద్వారా సోకుతుంది. బస్సుల్లో స్టాండ్స్‌, సీట్లు తదితర వాటిని తాకి.. అదే చేతులతో కండ్లను తాకవడం వంటి చేస్తే సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అపరిశుభ్రంగా ఉన్న వాటిని తాకకుండా ఉండడం మంచిదని, పలు చిట్కాలు పాటించి దీనికి దూరంగా ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

నివారణ చర్యలు..
ఐ ఫ్లూ వ్యాప్తిని నిరోధించేందుకు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. మురికిగా ఉన్న చేతులతో కళ్లను తాకడం మంచిది కాదు. ఇలా చేయడం ద్వారా వైరస్ కళ్లకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా పబ్లిక్‌ ప్లేసుల్లో ఎక్కడైనా చేతులతో తాకిన సందర్భంలో తప్పనిసరిగా హ్యాండ్‌ శానిటైజర్‌తో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం ద్వారా కేవలం కండ్లకలక మాత్రమే కాకుండా ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. రద్దీగా ఉండే వాహనాల్లో వెళ్లిన సమయంలో కండ్లకు సన్‌ గ్లాసెస్‌ లేదంటే, సేఫ్టీ గ్లాసెస్‌ను ధరించడం మంచిది. వీటితో గాలిలో ఉండే దుమ్మూ, ధూళి నుంచి రక్షణగా ఉండడమే కాకుండా వైరల్‌ నుంచి కాపాడతాయి. కరోనా ఇన్ఫెక్షన్ సమయంలో ప్రతిచోటా సామాజిక దూరాన్ని పాటించారు.

కండ్లకలకను సైతం నివారించడంలో సామాజిక దూరం పాటించడం అవసరం. ఐ ఫ్లూ సోకిన వ్యక్తులకు దగ్గరగా ఉంటే వేగంగా వ్యాపిస్తుంది. దూరంగా ఉంటే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కండ్లకలక సోకితే దురగా అనిపించిన సమయంలో కండ్లపై రుద్దకూడదు. తరుచూ శుభ్రంగా కళ్లను కడగడంతో పాటు తుడుచుకోవడానికి శుభ్రమైన కాటన్ క్లాత్‌ను లేదంటే.. టిష్యూ పేపర్‌ని వాడాలి. కండ్లకలక వచ్చిన సమయంలో వ్యక్తిగత వస్తువులను మరెవరికీ ఇవ్వకూడదు. మెడికల్ దుకాణాల్లో దొరికే ఆర్టిఫిషియల్ టియర్స్‌ని వినియోగించడం ద్వారా కొంత ఫలితం ఉంటుంది. ఆ ప్యాక్‌పైనుండే సూచనలు తప్పకుండా పాటించాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే కండ్లకలక వేగంగా రిలీఫ్‌ పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *