Eggs for Sex life: ఎగ్స్ తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా?

Eggs for Sex life: ఎగ్స్ తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా?

Eggs for Sex drive: సెక్సువల్ హెల్త్‌కు గుడ్లు ఎలా ఉపయోగపడతాయా అనే విషయం ఇక్కడ తెలుసుకోండి. లైంగిక సామర్థ్యం పెరిగేందుకు గుడ్లలోని ఏ పోషకాలు.. ఎలా ఉపకరిస్తాయంటే..

Eggs for Sex drive: ఎక్కువ సేవు శృంగారం చేసేలా లైంగిక సామర్థ్యం పెరగాలంటే వ్యాయామాలు, ప్రత్యేక డైట్స్, జీవనశైలిలో మార్పులు పాటించాలని ఎక్కువగా వింటుంటారు. అయితే, కొన్ని రకాల పౌష్టికాహారాలు తీసుకోవడం వల్ల కూడా మనుషుల్లో సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. కోడిగుడ్లను తినడం వల్ల కూడా సెక్సువల్ పర్ఫార్మెన్స్ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లలో ఉండే హై ప్రొటీన్ కంటెంట్, ఎక్కువ పోషకాల వల్ల సెక్సువల్ హెల్త్‌పై మంచి ప్రభావం ఉంటుందని సూచిస్తున్నారు. లైంగిక ఆరోగ్యానికి ఎగ్స్‌ ఎలా తోడ్పడతాయో ఇక్కడ చూడండి.

ఎక్కువ పోషకాలు

విటమిన్లు, మినరల్స్ లాంటి అవసరమైన పోషకాలను గుడ్లు కలిగి ఉంటాయి. లైంగిక ఆరోగ్యంలో కీలకమైన హార్మోన్ల ఉత్పత్తి, హార్మోన్ల నియంత్రణకు ఈ పోషకాలు ఉపకరిస్తాయి.

ప్రోటీన్ల ఉత్పత్తి

సెక్సువల్ హార్మోన్ల ఉత్పత్తికి అవసరమయ్యే నాణ్యమైన ప్రొటీన్లు గుడ్లలో ఉంటాయి. లైంగిక పనితీరుకు అవసరమయ్యే కణజాలాలను పెంచడం, సరిచేసేందుకు ఎగ్స్‌లోని ఈ ప్రోటీన్లు తోడ్పడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలసటను తగ్గించుకోవడానికి, శక్తిని పెంచుకునేందుకు కూడా గుడ్లు ఉపయోగపడతాయి. అంగ స్తంభన ప్రమాదాన్ని కూడా గుడ్లు తగ్గిస్తాయి.

బీ5, బీ6 విటమిన్లు

సెక్స్ హార్మోన్‍ల ఉత్పత్తికి ఉపయోగపడే విటమిన్ బీ5 (పాంటోథెనిక్ యాసిడ్), విటమిన్ బీ6 (పిరిడాక్సిన్) ఎగ్స్‌లో ఉంటాయి. హార్మోన్ల స్థాయిని నియంత్రిచటంలో ఈ విటమిన్లు ఉపయోగపడతాయి. ఆరోగ్యకమైన లైంగిక చర్యకు ఉపకరిస్తాయి.

జింక్

టెస్టోస్టిరాన్ ఉత్పత్తిలో కీలకమైన మినెరల్ ‘జింక్’ ఎగ్స్‌లో ఉంటుంది. పురుషులు, స్త్రీలలో లైంగిక కోరికలకు టెస్టోస్టిరాన్ హార్మోన్ చాలా ముఖ్యమైనది. సరైన మోతాదులో జింక్ తీసుకుంటే ఆరోగ్యకరమైన టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి మేలు జరుగుతుంది.

కోలిన్

గుడ్లలో కోలిన్ పోషకం కూడా మంచి మోతాదులో ఉంటుంది. మెదడు పనితీరు మెరుగ్గా ఉండడంతో కోలిన్ కీలక పాత్ర పోషిస్తుంది. లైంగికపరమైన కోరికలు, ఉద్రేకానికి మెదడు పని తీరు కూడా ముఖ్యమైనవి. అయితే, ఈ కోలిన్ అంశం అందరికీ వర్తించకపోవచ్చు.

లైంగిక ఆరోగ్యానికి ఎగ్స్‌ నేరుగా ప్రయోజనాలు కలిగిస్తాయనే రుజువులు లేవు. అయితే, గుడ్లలోనే పోషకాలు, విటమిన్స్ వల్ల మొత్తం ఆరోగ్యంతో పాటు సెక్సువల్ హెల్త్‌కు కూడా మేలు జరుగుతుంది. ముఖ్యంగా హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణ, అవసరమైన పోషకాలు గుడ్ల ద్వారా లభిస్తాయి. ఉడికించిన, గిలకొట్టిన, ఫ్రై చేసిన.. ఇలా గుడ్లను ఏ రూపంలో అయినా తినవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *