BRO Movie review (బ్రో మూవీ రివ్యూ): పవన్ కళ్యాణ్,సాయిధర్మ తేజ్ ఫ్యాన్స్ ను మెప్పించారా ..

BRO Movie review (బ్రో మూవీ రివ్యూ): పవన్ కళ్యాణ్,సాయిధర్మ తేజ్ ఫ్యాన్స్ ను మెప్పించారా ..

BRO Movie review (బ్రో మూవీ రివ్యూ): మెగా హీరోలు పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan), సాయి ధరమ్‌ తేజ్‌(Sai dharam tej) కలిసి నటించిన చిత్రం ‘బ్రో(Bro)’. తమిళంలో మంచి సాధించిన వినోదయ సీతం(Vinodaya seetham) చిత్రానికి ఇది తెలుగు రీమేక్. సముద్రఖని(Samutirakhani) దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్(Trivikram) స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. కేతిక శర్మ(Kethika sharma), ప్రియా ప్రకాశ్ వారియర్(Priya prakash varior) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా జులై 28 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ : (సాయి ధరమ్ తేజ్), ఎల్లప్పుడూ పనిలో మునిగిపోతాడు మరియు అతని కుటుంబంలో అతను మాత్రమే సంపాదించే సభ్యుడు. మార్క్ రమ్య (కేతిక శర్మ)తో ప్రేమలో ఉన్నాడు, కానీ అతను చాలా బాధ్యతలను ఎదుర్కోవాల్సి ఉన్నందున అతను తన లేడీ ప్రేమతో లేదా అతని కుటుంబంతో సమయం గడపడు. ఒక రోజు అతను రోడ్డు ప్రమాదంలో మరణిస్తాడు మరియు మార్క్ యొక్క ఆత్మ టైటాన్ (పవన్ కళ్యాణ్) అనే టైమ్ గాడ్‌ని కలుస్తుంది. మార్క్ టైటాన్‌కు జీవితంలో రెండవ అవకాశం ఇవ్వాలని అభ్యర్థించాడు, తద్వారా అతను తన బాధ్యతలను నెరవేర్చుకుంటాడు. టైటాన్ మార్క్‌కి 90 రోజుల సమయం ఇస్తుంది మరియు ఈ కాలంలో అతను మార్క్ చుట్టూ తిరుగుతాడు. మార్క్ తన కమిట్ మెంట్స్ ని ఎలా నెరవేర్చాడన్నదే మిగతా సినిమా.

వివరణ: జీవితం లో రెండో ఛాన్స్ ఇవ్వడం అనే కాన్సెప్ట్ పై ఇప్పటికి చాలా సినిమాలు వచ్చాయి. కానీ అవి దేవుని చుట్టూ తిరిగేవి. కానీ ఇందులో మాత్రం సమయాన్ని తీసుకొని.. పాత కథకి కొత్త టచ్ ఇచ్చారు దర్శకుడు. సమయం అనేది మనిషి జీవితంలో ఎంత విలువైనది అనే విషయాన్ని.. ఫ్యామిలీ ఎమోషన్స్ కు టచ్ చేసి చాలా బాగా ప్రెసెంట్ చేశారు. మనిషి జీవితకాలం సంపాదనలో పడి కుటుంబాన్ని, బంధాలను, బాధ్యతలను విస్మరించి బ్రతికేయడం సరైన పద్ధతి కాదనే సత్యాన్ని ఈ సినిమాలో చూపించారు. అయితే తీసుకున్న కథ బాగానే ఉంది కానీ.. ఒరిజినల్ లో లాగా సింపుల్ గా తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఈ కథకు పవన్ లాంటి స్టార్ యాడ్ అవడంతో.. మెయిన్ పాయింట్ గాడి తప్పి.. కమర్షియల్ అంశాలు ఎక్కువయ్యాయి. పవన్ గత సినిమాల తాలూకు స్పూఫ్స్ కూడా కావాలని ఇరికించారేమో అన్నట్టుగా అనిపించింది. కానీ ఆ సీన్స్ పవన్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ పాత్ర చాలా బాగా సెట్ అయ్యింది. ఆ పాత్రలో ఎమోషన్స్ కూడా బాగా పండాయి.

పవన్ ఎంట్రీ కాస్త లేట్ అయ్యింది కానీ.. అయన ఎంట్రీ తరువాతే సినిమా అసలు కథలోకి ఎంట్రీ ఇస్తుంది. తన లుక్స్ అండ్ ఎనర్జీతో సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు. తనదైన నటనతో, డైలాగ్స్ తో ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేసారు అనే చెప్పాలి. ఒక విధంగా చెప్పలాంటే ఈ సినిమాలో స్పెషల్ ఎలిమెంట్ ఏదైనా ఉందంటే.. అది పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. పవన్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా పూనకాలు లోడింగ్ అనే చెప్పాలి. ఇక మార్క్ పాత్రలో సాయి ధరమ్ తేజ్ కూడా అద్భుతంగా నటించారు. ఒకవైపు బిజీ బిజినెస్ మెన్ గా.. మరోవైపు ఫ్యామిలీ గురించి ఆలోచించే సాధారణ మనిషిగా చాలా ఎమోషనల్ గా నటించారు. సినిమా మొత్తం ఈ రెండు పాత్రల మీదే మెయిన్ గా నడుస్తుంది కాబట్టి.. మిగతా పాత్రలు పెద్దగా అనిపించవు. హీరోయిన్స్ కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారి పాత్ర మేరకు బాగానే నటించారు.

బ్రో సినిమాకి మెయిన్ హైలెట్ అంటే తమన్ సంగీతం అని చెప్పాలి. ప్రతీ సీన్ ని తన ఎలక్ట్రిఫైయింగ్ బీజీఎం తో నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాడు. మరీ ముఖ్యంగా సమయం(పవన్) ఎంట్రీ సీన్ లో ఆయన ఇచ్చన మ్యూజిక్ సినిమాకె హైలెట్ గా నిలిచింది. అయితే పాటలు మాత్రం పరవాలేదనిపించాయి. కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది.

ఇక మొత్తంగా చెప్పేలంటే.. బ్రో సినిమా కాన్సెప్ట్ బాగుంది కానీ.. కమర్షియాలిటీ ఎక్కువైంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రం పూనకాలు పక్కా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *