Aswin Appreciates Thilak varma:ప్రపంచకప్ గెలవాలంటే.. ఆ కుర్రాడిని తీసుకోవాలి

Aswin Appreciates Thilak varma: ప్రపంచ కప్ దగ్గర పడుతున్న సమయం లో సీనియర్ క్రికెటర్స్ టీమిండియా పట్ల తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. యువ క్రికెటర్, తెలుగు తేజం ఠాకూర్ తిలక్ వర్మపై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. తిలక్ వర్మను ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అతని చేరికతో టీమిండియా మిడిలార్డర్ మరింత బలోపేతమవుతుందని తెలిపాడు. తిలక్ వర్మను ఇబ్బంది పెట్టే బౌలర్ ఏ టాప్‌ టీమ్‌లో లేడని, అతను ప్లస్ పాయింట్ అవుతాడని అశ్విన్ అభిప్రాయపడ్డాడు..

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తిలక్ వర్మ.. (39, 51, 49 నాటౌట్) వరుసగా మూడు మ్యాచ్‌ల్లో రాణించాడు. 69.50 యావరేజ్‌ 139 స్ట్రైక్‌రేట్‌తో 139 పరుగులు చేశాడు. సహచర యువ ఆటగాళ్లు, పలువు స్టార్ ప్లేయర్లు వెస్టిండీస్ బౌలింగ్‌లో ఇబ్బంది పడుతుంటే తిలక్ వర్మ మాత్రం అలవోకగా షాట్లు కొడుతూ పరుగులు రాబడుతున్నాడు.

ప్రస్తుతం టీమిండియా లెఫ్టాండర్ బ్యాటర్ల కోసం చూస్తోంది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో తిలక్ వర్మను జట్టులోకి తీసుకుంటే మిడిలార్డర్ బలహీనతను అధిగమించవచ్చని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని అధిగమించి బ్యాటింగ్ చేస్తున్న తిలక్ వర్మ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అవుతాడని అశ్విన్ తన యూట్యూబ్ చానెల్‌ వేదికగా తెలిపాడు.

వరల్డ్ కప్ టీమ్‌లో చోటు కోసం చాలా పోటీ ఉంది. అయితే లెఫ్టాండర్ కావడం తిలక్ వర్మకు కలిసొచ్చే అంశం. తిలక్ వర్మను ఇబ్బంది పెట్టే క్వాలిటీ ఆఫ్ స్పిన్నర్లు ప్రస్తుతం ఏ టాప్ టీమ్‌లోనూ లేరు. అందుకే వరల్డ్‌కప్‌లో తాను ప్లస్ పాయింట్ అవుతాడు.’అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *