ASP hanumanthu inspiring story: స్ఫూర్తి ని ఇచ్చే ఒక పోలీస్ కథ..

ASP hanumanthu inspiring story: స్ఫూర్తి ని ఇచ్చే ఒక పోలీస్ కథ..

ASP hanumanthu inspiring story: బిచ్చ గాడు పోలీస్ అయ్యాడు వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. పేదరికంతో బిక్షం ఎత్తుకున్న వ్యక్తి నేడు పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన జీవితం మరి కొంతమందికి స్ఫూర్తిగా నిలవాలి అనుకున్న ఆ పోలీస్ అధికారి మొహమాటం లేకుండా తన బెగ్గింగ్ స్టోరీ చెప్పుకొచ్చారు. లక్ష్యం ఉంటే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు అంటున్న ఏఎస్పీ హనుమంతు.

ప్రతి ఒక్కరి గతాన్ని తవ్వితే ఎన్నో కష్టాలు బాధలు సమస్యలు ఉంటాయి అయితే ఎన్ని కష్టాలు వచ్చినా లక్ష్యంతో ఉన్నతమైన స్థాయికి చేరుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకప్పుడు బిక్షాటన చేసుకునే చిన్న కుర్రాడు ఇప్పుడు పోలీస్ అధికారి అయ్యారు. చిత్తూరు జిల్లా కలిగిరి మండలం తెల్లగుట్టపల్లి గ్రామానికి చెందిన హనుమంతు కడుపేదరికంలో జన్మించారు. సంచార జాతుల కుటుంబం కావడంతో తినేందుకు తిండి లేక తల్లిదండ్రులతో కలిసి ఆయన చిన్నతనంలో బిక్షం ఎత్తుకున్నారు. తన దుస్థితికి తల్లిదండ్రుల నిరక్షరాస్తితే కారణమని భావించిన హనుమంతు ఎలాగైనా ఉన్నత చదువులు చదివి జీవితంలో పైకి రావాలని చదువుకుని 1991లో ఎస్సైగా ఎంపికయ్యారు. అలా ప్రస్థానం ప్రారంభించిన పోలీస్ అధికారి హనుమంతు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఏఆర్ విభాగానికి అడిషనల్ ఎస్పీగా వెదురు నిర్వర్తిస్తున్నారు.

విద్యార్థుల్లో చైతన్యం కల్పించటమే లక్ష్యంగా ఆయన ముందుకు వెళుతున్నారు. బిచ్చగాడిలా మొదలై తన జీవితం ఇప్పుడు పోలీసు అధికారి స్థాయికి చేరిందని కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చునని ఆయన విద్యార్థులకు బోధిస్తున్నారు స్కూల్లు కాలేజీలో తన రియల్ స్టోరీని చెబుతూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు అవసరం కోసం ఆకలి తీర్చుకోవడానికి హనుమంతు లైఫ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీంతో తనికెళ్ల భరణి జయప్రకాష్ నారాయణ వంటి ప్రముఖులతో పాటు చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయ వివిధ వర్గాలకు చెందినవారు ఎస్పీ హనుమంతుకు ఫోన్ చేసి అభినందిస్తున్నారు.

అమ్మను గౌరవించాలని సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని మొక్కలు విరివిగా నాటాలంటూ ఎస్పీ హనుమంతు చేస్తున్న క్యాంపెయిన్ బాగుందని వారు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు ఎలాంటి మొహమాటం లేకుండా బిచ్చవెత్తుకునే స్థాయి నుంచి వచ్చానని పోలీస్ అధికారి హనుమంత చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *