AP BJP : బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నల కు వైసీపీ దగ్గర సమాధానం ఉందా….

 

AP BJP : బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నల కు వైసీపీ దగ్గర సమాధానం ఉందా….

BJP Vishnu Vardhan Reddy : వైసీపీ నాలుగేళ్ల పాలనపై ఏపీ బీజేపీ 9 ప్రశ్నలు సంధించింది. ఈ 9 ప్రశ్నలపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్దంగా ఉన్నామని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

BJP Vishnu Vardhan Reddy : ఏపీలో బీజేపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లక్ష్యంగా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. పురందేశ్వరి బాబు జనతా పార్టీ అధ్యక్షురాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ విమర్శలకు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి కౌంటర్ ఇవ్వడంతో 9 ప్రశ్నలు సంధించారు. వైసీపీ 4 ఏళ్ల పాలనపై బీజేపీ వేసిన 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడిన విష్ణువర్ధనరెడ్డి… బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి అడిగిన ప్రశ్నలకు భయపడి, సమాధానం చెప్పలేని వైకాపా నేతలు, మంత్రులు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రశ్నలపై టీటీడీ ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి 24 గంటల్లో శ్వేత్రపత్రం విడుదల చేస్తామని చెప్పినా, 48 గంటలైనా ఆ పనిచేయలేకపోయారని, సమాధానం లేక పారిపోయారా? అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *