Adipurush OTT release: OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్..ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వస్తుందంటే?

Adipurush OTT release: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ మూవీ ‘ఆదిపురుష్’ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఏ ప్రకటన లేకుండా సైలెంట్‌గా సినిమాను స్ట్రీమింగ్ చేశారు. మరి ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వస్తుందంటే?

భారీ బడ్జెట్‌తో రామాయణం కథ గా వచ్చిన ‘ఆదిపురుష్’ సినిమా మొత్తానికి ఓటీటీలోకి వచ్చేసింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ రాఘవుడిగా, కృతి సనన్ జానకిగా కనిపించారు. భారీ అంచనాలతో జూన్‌లో రిలీజైన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయితే తాజాగా ఎలాంటి న్యూస్ లేకుండా సైలెంట్‌గా ఈ సినిమాను ఓటీటీలోకి రిలీజ్ చేసారు.

ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆదిపురుష్ ప్రస్తుతం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారం అవుతోంది. అయితే హిందీ వెర్షన్‌కి సంబంధించి మాత్రం ఇంకా ఎలాంటి అప్‌డేట్ లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *